Home » తీన్మార్ న్యూస్ యాంకర్ శివజ్యోతి నెలకు ఎంత సంపాదిస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

తీన్మార్ న్యూస్ యాంకర్ శివజ్యోతి నెలకు ఎంత సంపాదిస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

by Anji
Ad

సాధారణంగా ఎవరి జీవితంలో అయినా సక్సెస్ అనేది మాత్రం అంత ఊరికే రాదు.. అంతేకాదు.. ఇక సమాజంలో సెలబ్రిటీ హోదా సాధించడం అంటే మామూలు విషయం కాదు. ఎంతో కష్టపడి చెమటోడిస్తేనే ఆ స్థాయికి చేరుకుంటాం అనేది జగమెరిగిన సత్యం. అలాంటి వారిలో మంచి గుర్తింపు సాధించినటువంటి తెలంగాణ అమ్మాయి శివ జ్యోతి. తాను ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం కోసం ఎన్నో ఎత్తుపల్లాలు దాటింది. యాంకర్ గా ప్రారంభించిన తన లైఫ్ యాక్టర్ దాకా వెళ్లింది. ప్రస్తుతం ఓ స్థాయికి చేరుకొని హ్యాపీగా తన జీవితాన్ని గడుపుతుంది. అలాంటి శివజ్యోతి గురించి కొన్ని విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

తెలంగాణ యాస భాషతో తీన్మార్ న్యూస్ ప్రజెంటర్ గా చేస్తూ.. అందరికీ అర్థం అయ్యే రీతిలో మాట్లాడే శివజ్యోతి ప్రజలందరికీ ఇప్పుడు పరిచయం అయింది. అలా న్యూస్ ఛానల్ లో న్యూస్ ప్రజెంటర్ గా చేస్తూ మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక ఆ తరువాత బిగ్ బాస్ రియాలిటీ షోలో కంటెస్టెంట్ గా చేస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గర అయింది. ఈ నేపథ్యంలో ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టి అభిమానులను మెస్మరైజ్ చేస్తోంది. శివజ్యోతి బిగ్ బాస్ నుంచి బయటికీ వచ్చిన తరువాత తన జీవితమే మారిపోయింది. కోట్లాది రూపాయలను సంపాదించింది. అలాగే లగ్జరీ కార్లను కూడా కొంటుంది శివజ్యోతి. 1990లో నిజామాబాద్ జిల్లాలో జన్మించిన సావిత్రి అలియాస్ శివజ్యోతి. హైదరాబాద్ కి తన లవర్ తో వెళ్లింది. అక్కడ ఎన్నో కష్టాలు ఎదుర్కుంది. 2016లో V6 ఛానల్ నుంచి తెలంగాణ యాస మాట్లాడే యాంకర్ కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలుసుకొని ఆడిషన్స్ కి వెళ్లింది. తొలి ఇంటర్వ్యూకే సెలెక్ట్ అయింది.

Advertisement

ఆ ఛానల్ లో ఫిలిం న్యూస్ తో పాటు తీన్మార్ ప్రోగ్రామ్ చేసింది. ఇక తీన్మార్ వార్తలతో చాాలా ఫేమస్ అయింది. అప్పటి వరకు శివజ్యోతిగా ఉన్న ఈమె పేరు తీన్మార్ సావిత్రిగా మార్చుకుంది. ఇక తరువాత 2019లో బిగ్ బాస్ షోకి కూడా వెళ్లింది. బిగ్ బాస్ షో నుంచి  98 రోజుల తరువాత బయటికి వచ్చేసింది. ఇక ఆ తరువాత యూట్యూబ్ ఛానల్ ఓపన్ చేసి చాలా ఫేమస్ అయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న శివజ్యోతి పలు సినిమా ప్రోగ్రామ్స్ చేస్తూ చాలా బిజీగా మారింది. అలా సోషల్ మీడియా ప్రోగ్రామ్స్ ద్వారా నెలకు దాదాపు రూ.8 లక్షల నుంచి 10 లక్షల వరకు సంపాదిస్తుందట. ఓ బీఎండబ్ల్యూ కారు, కియా కారు హైదరాబాద్ లో సొంత ఇల్లు, ఊర్లో కూడా ఇల్లు కట్టుకొని వాటిని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ చూపించింది. చాలా కష్టపడి ఎదిగిన శివజ్యోతి కోట్ల ఆస్తులను సంపాదించుకుంది. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

స్టార్ హీరో కొడుకు వేధించాడంటూ వార్తలు.. స్పందించిన కృతి శెట్టి

Kailasa PM Ranjitha : నిత్యానంద రాజ్యానికి ప్రధానిగా నటి రంజిత!

Visitors Are Also Reading