Home » స్పైడర్ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా…?

స్పైడర్ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా…?

by Bunty
Ad

సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మహేష్ బాబు నటనకు వేలాదిమంది అభిమానులు ఉన్నారు. తన నటన, అందంతో వేలాది మంది అభిమానులను సంపాదించుకొని వరుస సినిమాలను చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇక మహేష్ బాబు నటించిన సినిమాలలో ‘స్పైడర్’ మూవీ కూడా ఒకటి. ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించినటువంటి చైల్డ్ ఆర్టిస్ట్ చాలా అద్భుతంగా నటించాడు.

Advertisement

అతని పేరు సంజయ్. ఈ పాత్రలో ఈ బాబు అద్భుతంగా నటించాడు. ఎవరైనా ఎవరైనా ఒక వ్యక్తి మరణించినప్పుడు తన కుటుంబసభ్యులు, బంధువులు ఏడ్చినప్పుడు దానిలో ఆనందాన్ని వెతుక్కుంటాడు. ఇతను చాలా డిఫరెంట్ మైండ్ సెట్ ఉన్న పాత్రలో నటించాడు సంజయ్. స్పైడర్ సినిమా అనంతరం ఇతనికి కోలీవుడ్ లో వరుస సినిమాలు క్యూ కట్టాయి. జాక్ పాట్, జాగముని ఇంకా చాలా సినిమాల్లో నటించి మెప్పించాడు.

Advertisement

చెన్నైలో పుట్టినటువంటి సంజయ్ కుట్టి టాకీస్ అనే పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ ని నడిపిస్తున్నాడు. ఇతను చాలా రీల్స్, డ్యాన్స్ వీడియోలు చేస్తూ స్పైడర్ సంజయ్ అనే ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేస్తాడు. చదువుతో పాటు చాలా టాలెంట్ ఉన్నా సంజయ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. తన డ్యాన్స్ వీడియోలతో ఎంతోమంది ఫాలోవర్స్ ను సంపాదించుకుంటున్నారు. మరి సంజయ్ భవిష్యత్తులో ఏమైనా సినిమాలలో హీరోగా నటించే అవకాశాలు ఉన్నాయేమో చూడాలి.

ఇవి కూడా చదవండి

“BRO”లో అంబటి రాంబాబు..ఇదేందయ్యా ఇది !

సీఎంకే ఫోన్ చేసి తన కూతురు పెళ్లికి రావద్దని చెప్పిన సూపర్ స్టార్ కృష్ణ..!

కావ్య బాధపడుతుంటే చూడలేకపోయా.. సన్‌రైజర్స్ పై రజినీకాంత్‌ సంచలనం

Visitors Are Also Reading