Home » ‘శోభా.. నీకు ఎర్రగడ్డే దిక్కు’.. మోనితకు కౌంటర్ ఇచ్చిన భోలే..!

‘శోభా.. నీకు ఎర్రగడ్డే దిక్కు’.. మోనితకు కౌంటర్ ఇచ్చిన భోలే..!

by Anji
Ad

బిగ్ బాస్ హౌస్ లో ఏడో వారం నామినేషన్స్ రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా  నిన్నటి ఎపిసోడ్ లో ప్రశాంత్ వర్సెస్ సందీప్ కాగా.. ఈరోజు భోలే వర్సెస్ శోభా, ప్రియాంక జరిగినట్టు  తెలుస్తోంది. సీరియల్ బ్యాచ్ మొత్తం భోలేను నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇవాళ  విడుదలైన ఫస్ట్ ప్రోమోలో కన్నడ భామలు ప్రియాంక, శోభా శెట్టి పాటబిడ్డపై రెచ్చిపోయారు. నటిస్తున్నావ్.. నటిస్తున్నావ్ అంటూ అరిచి గోల చేశారు. ముఖ్యంగా భోలేను చూస్తూ థూ అంటూ నోరుజారింది ప్రియాంక.

Advertisement

 

నువ్వు నన్ను థూ అన్నావ్.. అదే థూ నేను ఊస్తే నీ బతుకు ఏం కావాలి అంటూ గట్టిగానే ఇచ్చిపడేశాడు భోలే. ఇక ఇప్పుడు సెకండ్ ప్రోమోలో ఒక్కొక్కరికి చుక్కలు చూపించాడు పాటబిడ్డ. భోలే తనను నామినేట్ చేయడంతో సైకో మోనితగా మారిపోయింది శోభా శెట్టి. అటు ఇటు తిరుగుతూ అరుస్తూ నానా హంగామా చేసింది.  రెండో ప్రోమోలో.. అమర్ దీప్ ను నామినేట్ చేసింది అశ్విని. కుండపెట్టి కొట్టే ముందు ఒక్కసారి ఆలోచించి అప్పుడు కొట్టు అంటూ అమర్ దీప్ అనడంతో తన నిర్ణయాన్ని మార్చుకోవడానికి బిగ్‏బాస్ పర్మిమిషన్ కోరింది.  

Advertisement

ఇక ఆ తర్వాత తన నెక్ట్స్ ఆప్షన్ అర్జున్ అని చెప్పడంతో ఫస్ట్ నా దగ్గరకే రావొచ్చు కదా.. అని అర్జున్ అనగా.. నీ దగ్గరకు ఏం వస్తాను. నిన్ను చూస్తేనే భయం వేస్తుంది అటు ఇటూ చేస్తావేమో అని అశ్విని అనేసింది. దీంతో ఏం చేస్తాను..హౌస్ లో నిన్నూ అంటూ సైటైర్ వేశాడు. ఇక ఈ ఆ తర్వాత శివాజీని నామినేట్ చేస్తూ ఫైర్ అయిపోయాడు గౌతమ్. చేతిలోని బ్యాట్ విసిరి కొడుతూ సీరియస్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన భోలే మాత్రం శోభాను ఓ ఆటాడుకున్నాడు. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

లియో దర్శకుడు లోకేష్ కనకరాజ్ మొదటి చిత్రం ‘నగరం’ అప్పట్లో ఎంత వసూలు చేసిందో తెలుసా?

బిగ్ బాస్ షోను నాగార్జున చూస్తారా? చూడరా? అసలు నిజం వెల్లడి..!

Visitors Are Also Reading