Home » లియో దర్శకుడు లోకేష్ కనకరాజ్ మొదటి చిత్రం ‘నగరం’ అప్పట్లో ఎంత వసూలు చేసిందో తెలుసా?

లియో దర్శకుడు లోకేష్ కనకరాజ్ మొదటి చిత్రం ‘నగరం’ అప్పట్లో ఎంత వసూలు చేసిందో తెలుసా?

by Anji
Ad

సౌత్ ఇండియాలో ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి.. శంకర్ తరువాత టాప్ దర్శకులు ఎవరు అనే లిస్ట్ తీస్తే.. అందులో లోకేష్ కనకరాజ్ పేరు మాత్రం తప్పక ఉంటుంది. టాలీవుడ్ నుంచి సుకుమార్ పేరు కూడా వినిపిస్తుంటుంది. అయితే తమిళ హీరో కార్తీ నటించిన ఖైదీ మూవీ ద్వారా దర్శకుడు బాగా పాపులారిటీ సంపాదించాడు.  ఈ సినిమా అప్పట్లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిందో మన అందరికీ తెలిసిందే.ఈ సినిమా తర్వాత ఆయన దర్శకత్వం వహించిన ‘మాస్టర్’ చిత్రం కూడా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 

Advertisement

ఈ రెండు సినిమాల తర్వాత ఆయన తీసిన విక్రమ్ మూవీ అయితే  ఇండస్ట్రీ లో ఉన్న రికార్డులను అన్నింటిని బద్దలు కొట్టి సుమారుగా రూ. 500 కోట్ల గ్రాస్ ని రాబట్టింది.అలాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఆయన మళ్ళీ విజయ్ తో కలిసి లియో అనే చిత్రం చేశాడు.  ఈ సినిమా పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో మనమంతా చూస్తూనే ఉన్నాము.తమిళ ప్రేక్షకులతో పాటుగా , తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమా టికెట్స్ కోసం యుద్దాలు చేస్తున్నారు.అక్టోబర్ 19 వ తారీఖున విడుదల అవ్వబోతున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబడుతుందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇలా సౌత్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ మొత్తం తన వైపు చూసేలా చేసుకున్న లోకేష్ మొదటి చిత్రం ‘నగరం’ 

Advertisement

 సందీప్ కిషన్   హీరో గా   నటించిన ఈ సినిమాని తొలుత ‘మా నగరం’ అనే టైటిల్ తో తమిళం లో రిలీజ్ చేసాడు.అక్కడ సూపర్ హిట్ అవ్వడం తో తెలుగు లో నగరం పేరుతో విడుదల చేశారు. ఈ సినిమా అప్పట్లో ఎంత వసూళ్లు రాబట్టింది అనేది ఇప్పటి ఆడియన్స్ కి తెలీదు.కానీ మాకు అందిన సమాచారం ప్రకారం , ఈ సినిమా ఫుల్ రన్ కలెక్షన్స్ తెలుగు మరియు తమిళం కలిపి ఎంత వచ్చిందో చెప్పబోతున్నాం.  ఈ చిత్రం అప్పట్లో కేవలం తమిళనాడు నుండి 10 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది అట.అప్పట్లో 10 కోట్లు గ్రాస్ అంటే చాలా పెద్ద విషయమే, అలాగే తెలుగు లో ఈ చిత్రానికి దాదాపుగా నాలుగు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.మొత్తం మీద రెండు భాషలకు కలిపి 7 కోట్ల రూపాయిలు షేర్ వసూళ్లు వచ్చాయి అన్నమాట కమర్షియల్ గా   మంచి  సక్సెస్ అయింది.  కథ కథనం మొత్తం ఖైదీ మూవీ తర్వాత ‘నగరం’ చిత్రం లోనే బాగుంటుంది. ఇక ఇప్పటి వరకు ఎవ్వరైనా ఈ సినిమా వీక్షించని వారు  యూట్యూబ్ లో వీక్షించండి. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

మహేష్ బాబుకి సూపర్ స్టార్ కృష్ణ అస్తి కాకుండా.. ఇంకా ఏం ఇచ్చారో తెలుసా..?

Sree Leela : శ్రీ లీల – అనిల్ రావిపూడి మధ్య ఆ రిలేషన్..?

Visitors Are Also Reading