Home » బిగ్ బాస్ షోను నాగార్జున చూస్తారా? చూడరా? అసలు నిజం వెల్లడి..!

బిగ్ బాస్ షోను నాగార్జున చూస్తారా? చూడరా? అసలు నిజం వెల్లడి..!

by Anji
Ad

 బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షోను అక్కినేని నాగార్జున..  చూస్తారా? చూడరా ? అనే చర్చ ప్రేక్షకుల మధ్య తరచూ జరుగుతూ ఉంటుంది. కొంతమంది క్రిటిక్స్ నాగార్జున బిగ్ బాస్ షో ను చూడరని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం నా సామిరంగ మూవీలో నటిస్తున్న నాగార్జునకు బిగ్ బాస్ షోకు సంబంధించి ప్రశ్న ఎదురు కాగా ఆసక్తికర సమాధానం ఇచ్చారు. తాను బిగ్ బాస్ షోను హాట్ స్టార్ లో చూస్తానని నాగ్ వెల్లడించారు.

Bigg Boss7

Bigg Boss7

 అయితే బిగ్ బాస్ షోకు సంబంధించి ప్రతి ఒక్క విషయాన్ని గమనించాల్సి ఉంటుందని బిగ్ బాస్ ఎపిసోడ్ ఫాలో కాకపోతే..  హోస్ట్ గా వ్యవహరించడం చాలా కష్టం అని నాగ్ చెప్పుకొచ్చారు. ప్రతిరోజూ ఉదయం హాట్ స్టార్ లో  బిగ్ బాస్ ఎపిసోడ్స్ చూస్తానని నాగ్ కామెంట్స్  చేశారు. బిగ్ బాస్ షోలో ప్రేక్షకులు చూడనివి కూడా నేను చూస్తానని నాగ్ కామెంట్లు చేశారు.వీకెండ్ ఎపిసోడ్ కు ముందు ఆ వీక్ హైలెట్స్ ను మరోసారి చూస్తానని నాగార్జున చెప్పుకొచ్చారు.

Advertisement

Advertisement

 బిగ్ బాస్ షో అనేది మంచి అనుభవం అని.. కొంతమంది హౌస్ లో కొద్ది రోజులు నటించినా తర్వాత రియల్ బిహేవియర్ ని బయట పెట్టక తప్పదు అని.. పేర్కొన్నారు నాగార్జున. ఈ షో నాకు ఒక కొత్త అనుభవం అని వెల్లడించారు. ప్రస్తుతం నాగార్జున వెల్లడించిన ఈ విషయాలు..  సోషల్ మీడియాలో  తెగ వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ షో సీజన్ 7 రేటింగ్స్ బాగానే ఉన్నాయని తెలుస్తోంది. బిగ్ బాస్ షో నాగ్ కెరీర్ కు ఎంతో మేలు చేసిందనే చెప్పాలి. బిగ్ బాస్ షోకు నాగార్జునకు సినిమాల కంటే ఎక్కువ రెమ్యునరేషన్ దక్కుతోందని చెప్పాలి. త్వరలోనే నాగార్జున  భారీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడంతో పాటు.. భారీ విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ ఫీల్  అవుతున్నారు. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

మహేష్ బాబుకి సూపర్ స్టార్ కృష్ణ అస్తి కాకుండా.. ఇంకా ఏం ఇచ్చారో తెలుసా..?

 హీరో తొడలపై కూర్చోమన్నారు…ఎంగిలి ఐస్ క్రీమ్ తినమన్నారు – సుహాసిని

Visitors Are Also Reading