Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » ఆమెకు 45, అతనికి 25.. టీచర్ లవ్ స్టోరీ లో ట్విస్టులు ఏంటంటే..?

ఆమెకు 45, అతనికి 25.. టీచర్ లవ్ స్టోరీ లో ట్విస్టులు ఏంటంటే..?

by Sravanthi Pandrala Pandrala
Published: Last Updated on
Ads

ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్న ఆయత్ నగర్ అనుమానస్పద మృతి కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో మృతుడు రాజేష్ విషం కారణంగానే మరణించినట్లు పోస్టుమార్టం లో వెళ్లడైంది. మరి రాజేష్ తనకు తానే విషం సేవించారా లేదంటే బలవంతంగా తాగించారా అనేది మిస్టరీగా మారింది.. అయితే రాజేష్ మృతదేహం దొరికిన చోట ఎక్కడా కూడా విషనికి సంబంధించిన ఆనవాళ్లు లేవు.పూర్తి వివరాలు ఏంటో చూద్దామా.. సరిగ్గా ఏడు నెలల కింద వనస్థలిపురానికి చెందిన సుజాత మొబైల్ నుండి రాజేష్ కు రాంగ్ కాల్ వెళ్ళింది.

Advertisement

Ad

 

ఈ సందర్భంలోనే ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. సుజాత వాట్సప్ డీపీ చూసిన రాజేష్ ఆమెకు పెళ్లి కాలేదని భావించి, పెళ్లి చేసుకుంటానని వాట్సాప్ మెసేజ్ లు పెట్టడం మొదలుపెట్టారు. ఆ తర్వాత సుజాత కు పెళ్లి అయింది అన్న విషయం తెలిసి రాజేష్ దూరం పెట్టినట్లు తెలుస్తోంది. అయితే రాజేష్ కు 25 సంవత్సరాలు సుజాతకు 45 సంవత్సరాలు. పైగా ఆమెకు పెళ్లయింది. ఈ విషయాలు తెలిసి పూర్తిగా ఆమెకు దూరమవుతూ వచ్చారు. కానీ సుజాత మాత్రం తనను కలవాలని, లేదంటే నేను చచ్చిపోతానని బెదిరించినట్టు సమాచారం. దీంతో భయపడిపోయిన రాజేష్ ఈనెల 24న ఆమెను కలవడానికి వెళ్లారట.

కానీ అప్పటికే విషం తాగిన ఆమెను వారి కుటుంబీకులు ఆసుపత్రిలో చేర్చారు. ఈ విషయం తెలియక రాజేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళగానే వారి కుటుంబీకులు బంధువులు గొడవ పెట్టుకున్నారు. ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ విషయం తెలుసుకున్న రాజేష్ ఐదు రోజుల తర్వాత శవమై కనిపించాడు. దీంతో ఆయన బాడీ పోస్టుమార్టంకి వెళ్ళింది. అక్కడ విషయం తాగి మరణించినట్టు వెల్లడైంది. కానీ బాడీపై ఎలాంటి గాయాలు లేవు. ఇక్కడే అసలు అనుమానం మొదలైంది.. తాను చనిపోయిన ప్రదేశంలో ఎక్కడా కూడా విషం తాగిన ఆనవాళ్ళు కనిపించలేదు. దీంతో ఆయనను ఎవరైనా చంపారా లేదంటే తానే స్వయంగా చనిపోయారా అనేది మిస్టరీగా మారింది.

మరికొన్ని ముఖ్య వార్తలు :

Visitors Are Also Reading