Home » పవన్ రికార్డ్ ను అవలీలగా వెనక్కు నెట్టేసిన మహేష్… ఏకంగా అంత తేడాతో..!

పవన్ రికార్డ్ ను అవలీలగా వెనక్కు నెట్టేసిన మహేష్… ఏకంగా అంత తేడాతో..!

by AJAY
Published: Last Updated on
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలు అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వీరిద్దరి సినిమాలు విడుదల అయ్యాయి అంటే థియేటర్ల దగ్గర పండగ వాతావరణం నెలకొంటూ ఉంటుంది. అలాగే వీరి సినిమాలకు హిట్… ఫ్లాప్ లతో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ మొత్తంలో కలెక్షన్లు కూడా వస్తూ ఉంటాయి.

pawan-kalyan-and-mahesh-babu-images

Advertisement

 

అంతటి క్రేజ్ కలిగిన ఈ ఇద్దరి మూవీలు ఎప్పటికప్పుడు అనేక విషయాలలో రికార్డులను సృష్టిస్తూ ఉంటాయి. అలాగే ఒకరి రికార్డులను ఒకరు చెరిపేస్తూ కొత్త రికార్డులను సృష్టిస్తూ ఉంటారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ నుండి ఈ చిత్ర బృందం ఫస్ట్ గ్లిమ్స్ వీడియోను విడుదల చేసింది.

Advertisement

ఈ మూవీ గ్లిమ్స్ వీడియో ఎన్నో రికార్డులను వెనక్కు నెట్టేసి టాప్ వన్ ప్లేస్ లో నిలుస్తుంది అని చాలామంది అనుకున్నారు. కాకపోతే ఈ సినిమా గ్లిమ్స్ వీడియోకు 24 గంటల సమయంలో 15.77 మిలియన్ వ్యూస్ లభించాయి. దానితో ఈ మూవీ గ్లిమ్స్ వీడియో మూడవ స్థానంలో నిలిచింది. దీనికంటే ముందు పుష్ప 2 మూవీలోని వేర్ ఇస్ ద పుష్ప వీడియో మొదటి స్థానంలో ఉండగా… లైజర్ ఫస్ట్ గ్లిమ్స్ వీడియో రెండవ స్థానంలో ఉంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మహేష్ “గుంటూరు కారం” అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసింది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా నుండి తాజాగా ఈ మూవీ బృందం ఫస్ట్ గ్లిమ్స్ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియో ఇప్పటివరకు ఏ సినిమా గ్లిమ్స్ వీడియోకు 24 గంటల్లో సమయంలో రాని వ్యూస్ ను సాధించింది. ఈ మూవీ వీడియోకు 24 గంటల్లో 20.98 మిలియన్ వ్యూస్ వచ్చాయి.. ఇలా ఈ మూవీ ఫస్ట్ గ్లిమ్స్ వీడియో ఆల్ టైమ్ రికార్డ్ ను నమోదు చేసింది.

Visitors Are Also Reading