Home » ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ గా షర్మిల నియామకం.. కాంగ్రెస్ అధిష్టానం ప్రకటన

ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ గా షర్మిల నియామకం.. కాంగ్రెస్ అధిష్టానం ప్రకటన

by Anji
Ad

వైఎస్ షర్మిల వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి.. కాంగ్రెస్ కండువా కప్పుకున్న తర్వాత ఆమెకు కీలక బాధ్యతలు అప్పగిస్తారు అనే చర్చ సాగింది. ఆమెకు పీసీసీ  చీఫ్ గా నియమిస్తారని ప్రచారం సాగింది. దానికి అనుగుణంగానే వైఎస్ షర్మిలను పీసీసీ చీఫ్ గా నియమించింది కాంగ్రెస్ అధిష్టానం. వైఎస్ షర్మిలను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నియమించినట్టు ఓ ప్రకటన విడుదల చేశారు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్. ఇదే సమయంలో సోమవారం రోజు పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన గిడుగు రుద్రరాజును కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించినట్టు పేర్కొన్నారు.

Advertisement

Advertisement

ఏపీ పసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేసి.. షర్మిలకు లైన్ క్లియర్ చేసిన విషయము తెలిసిందే.  గిడుగు రుద్రరాజు తో రాజీనామా వైయస్ షర్మిల కు లైన్ క్లియర్ కాగా ఇవాళ వైఎస్ షర్మిలను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నియమించింది కాంగ్రెస్ అధిష్టానం. ముఖ్యంగా రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా మారిపోయింది. వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ను రేసులోకి తీసుకొచ్చేందుకు అధిష్టానం వ్యూహాలను రచిస్తోంది. దానిలో భాగంగా ఏపీ కాంగ్రెస్ తగ్గాలను షర్మిలకు అప్పగించింది అంటున్నారు విశ్లేషకులు. ఇటీవలే ఢిల్లీలో ఏఐసిసి చీప్ మల్లికార్జున కార్గే రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్లో చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతము తన కుమారుడు రాజారెడ్డి పెళ్లి పనుల్లో వైఎస్ షర్మిల బిజీగా ఉన్నారు.

Visitors Are Also Reading