Home » జవాన్ ట్రైలర్ వచ్చేది అప్పుడే.. సలార్ రికార్డ్స్ పై గురి..!

జవాన్ ట్రైలర్ వచ్చేది అప్పుడే.. సలార్ రికార్డ్స్ పై గురి..!

by Anji

దాదాపు పది సంవత్సరాల తర్వాత ఇండస్ట్రీ ఇట్టి ఇచ్చిన కింగ్ షారుఖ్ ఖాన్ తనని బాక్సాఫీస్ బాద్షా అని ఎందుకు పిలుస్తారో ప్రూవ్ చేసుకున్నాడు. యావరేజ్ సినిమా తోనే రూ.1000 కోట్లు వసూలు చేసి ట్రేడ్ వర్గాలు కూడా షాక్ ఇచ్చి ఓ రేంజ్ లో హిట్ కొట్టాడు షారుక్ ఖాన్. ప్రస్తుతం ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ జవాన్ మూవీని చేస్తున్నాడు. సౌత్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీపై అనౌన్స్మెంట్ తోనే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న జవాన్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులను స్పీడ్ అప్ చేసి జూన్ 2నే జవాన్ మూవీని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

కానీ పోస్ట్ ప్రొడక్షన్ డిలే కారణంగా జవాన్ సినిమాను సెప్టెంబర్ 7 కు వాయిదా వేశారు. ఈ సినిమా నుంచి టీజర్ ఎప్పుడు బయటకు వస్తుందని షారూఖ్ ఖాన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా టీజర్ అప్డేట్ కోసం రచ్చ రచ్చ చేశారు. ఇలాంటి సమయంలో అసలు టీజరే కాదు.. ట్రైలర్ తో బయటికి వస్తాం కాస్కోండి అంటూ షాక్ ఇచ్చారు జవాన్ మూవీ మేకర్స్. జవాన్ టీజర్ కోసం షారుక్ అభిమానులు అందరూ వెయిట్ చేస్తుంటే.. ట్రైలర్ అనౌన్స్మెంట్ మాత్రం త్వరలోనే రాబోతుంది వెయిట్ చేయండి అంటూ మేకర్స్ ట్వీట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో జవాన్ ట్రైలర్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది.

ట్రైలర్ ఏ రోజు రిలీజ్ అవుతుందని అనౌన్స్మెంట్ టు మేకర్స్ నుంచి ఏ క్షణంలో అయినా బయటకు రావచ్చు. అయితే ఇప్పటికీ ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు జవాన్ ట్రైలర్ ని మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రెకోనింగ్ అనే సినిమాతో పాటు రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది. హాలీవుడ్ సూపర్ స్టార్ నటించిన ఈ సినిమా జూలై 12న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా విడుదలయ్యే అన్ని థియేటర్లలో జవాన్ ట్రైలర్ ని అటాచ్ చేయనున్నారట. ఇందుకు సంబంధించిన అనౌన్స్మెంట్ మేకర్స్ నుంచి బయటకు రానుంది. ఇక ఇదిలా ఉంటే జవాన్ వర్సెస్ సలార్ బిజినెస్ అనే టాక్ గత కొద్దిరోజులుగా వినిపిస్తోంది. థియేటర్ బిజినెస్ నుంచి ఆడియో రైట్స్ వరకు ప్రతి విషయంలో షారుక్ ఖాన్ ప్రభాస్ సినిమాల మధ్య పోటీ నెలకొంది. జవాన్, సలార్, వార్ ట్రైలర్ రికార్డ్స్ నుంచే మొదలవుతుందేమో వేచి చూడాలి మరీ.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

మరోసారి వివాదంలో చిక్కుకున్న నయనతార దంపతులు..! ఉమ్మడి ఆస్తులు కాజేసారంటూ వారిపై కేసు నమోదు

ఐటెమ్ సాంగ్ కోసం రూ. 7 కోట్లు ఖ‌ర్చు పెడుతున్న ‘పుష్ప 2’…!

Visitors Are Also Reading