Telugu News » Blog » సౌత్ ను నమ్ముకోవడం షారుఖ్ కు కలిసొస్తుందా..?

సౌత్ ను నమ్ముకోవడం షారుఖ్ కు కలిసొస్తుందా..?

by Manohar Reddy Mano
Ads

బాలీవుడ్ లో టాప్ హీరోలలో ఉండే షారుఖ్ ఖాన్ కు ఈ మధ్య ఒక్క హిట్ కూడా లేదు అనే విషయం తెలిసిందే. బాలీవుడ్ బాద్ షా, కింగ్ కాంగ్ అని ఇలా ఎన్ని పేర్లు ఉన్న హిట్ లేకపోవడంతో అక్కడ షారుఖ్ ఖాన్ క్రేజ్ అనేది కొంచెం తగ్గింది అనే చెప్పాలి. ఇక షారుఖ్ ఖాన్ సినీ ప్రయాణం ప్లాప్స్ లో పడిన సమయంలోనే హిందీలో మన సౌత్ సినిమాల డామినేషన్ అనేది ఎక్కువగా పెరిగింది.

Advertisement

దాంతో మళ్ళీ హిట్ ట్రాక్ అనేది ఎక్కాలి అంటే మన సౌత్ దర్శకులతో సినిమాలు చేయాలి అని ఫిక్స్ అయిన షారుఖ్ ఖాన్.. మొదట రాజమౌళిని సంప్రదించాడు. కానీ జక్కన అందుకు ఒప్పుకోలేదు. అందువల్ల కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో ఇప్పుడు ఓ సినిమా చేస్తున్నాడు షారుఖ్ ఖాన్. జవాన్ అనే పేరుతో పాన్ ఇండియా లెవల్ లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి.

Advertisement

అయితే షారుఖ్ ఖాన్ అనుకున్న విధంగానే సౌత్ డైరెక్టర్ తో చేస్తున్న ఈ జవాన్ సినిమా అనేది హిట్ ఆశలను ఆయనకు కలిగిస్తుంది. తాజాగా ఈ సినిమా తోక నాన్ థియేట్రికల్ బిజినెస్ అనేది భారీ రేంజ్ లో జరిగినట్లు తెలుస్తుంది. జవాన్ ఓటిటి హక్కులను నెట్ ఫ్లిక్స్ సాధించగా.. సాటిలైట్ హక్కులను జీ సంస్థకు వెళ్లాయి. అయితే ఈ రెండు రైట్స్ అమ్మడం వాళ్ళ 250 కోట్లు వచ్చాయి అని తెలుస్తుంది

Advertisement

ఇవి కూడా చదవండి :

బీసీసీఐ ఎన్నికల ప్రకటన వచ్చేసింది..!

కెప్టెన్ కూల్ పై ఫ్యాన్స్ ఫైర్..!