Home » దర్శకుడు రాజమౌళి గురించి సీనియర్ నటి కాంచన సెన్సేషనల్ కామెంట్స్..!

దర్శకుడు రాజమౌళి గురించి సీనియర్ నటి కాంచన సెన్సేషనల్ కామెంట్స్..!

by Anji
Ad

దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇటీవల ఆర్ఆర్ఆర్ చిత్రం సూపర్ హిట్ సాధించి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నారు రాజమౌళి. మరోవైపు రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి నాటు నాటు పాట కూడా ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. ప్రపంచ వ్యాప్తంగా రాజమౌళి పేరు మారు మ్రోగిపోతుంది. ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోయే తరువాత చిత్రం కోసం సిద్ధమవుతున్నారు. ఈ సినిమా కోసం హాలీవుడ్ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు.

Also Read : రమ్యకృష్ణ గురించి దర్శకుడు కృష్ణవంశీ చెప్పిన మాటలు వింటే ఆశ్చర్యపోక ఉండరు..!

Advertisement

ఇదిలా ఉంటే.. సీనియర్ నటి కాంచన ఓ ఇంటర్వ్యూలో రాజమౌళిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. బాహుబలి సినిమాలో ఓ క్యారెక్టర్ కోసం తనను సంప్రదించిన రాజమౌళి రెమ్యునరేషన్ విషయంలో తక్కువ చేసి మాట్లాడారని ఆమె చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె అసలు ఏం చెప్పిందంటే.. బాహుబలి సినిమాలో  ఓ క్యారెక్టర్ కోసం రాజమౌళి తనను సంప్రదించారని, కానీ డబ్బులు ఇవ్వడానికి చాలా ఆలోచించారని చెప్పారు. ఆయనకు లేని డబ్బులా ? అని కూడ ఈ సందర్భంగా ఆమె ప్రశ్నించారు. తమ లాంటి వారికి ఇస్తే ఎన్నో సేవలు చేసుకుంటాం కదా, ఎందుకు బాధపడతారో తెలియదు అని కామెంట్ చేశారు.

Advertisement

Also Read : అల్లరి నరేష్ ఆ హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకున్నాడా ?

Manam News

రెండు రోజుల డేట్స్ కోసం తాను రూ.5లక్షలు అడిగితే రాజమౌళి చాలా ఎక్కువ అన్నారని చెప్పారు. ఆ తరువాత తాను కూడా సైలెంట్ గా ఉండిపోయానని చెప్పుకొచ్చారు. బాహుబలి సినిమాలో హీరో ఓల్డ్ క్యారెక్టర్ కు హీరోయిన్ గా అడిగారని గుర్తు చేసుకున్నారు. ఈ విషయంలో తాను ఏమి క్రిటిసైజ్ చేయలేదని.. ఓల్డ్ ఆర్టిస్ట్ ల పరిస్థితిని అర్థం చేసుకోవాలని సూచించారు. రాజమౌళికి గతంలో దివంగత నటి శ్రీదేవి విషయంలో ఇలాంటి పరిస్థితే ఎదురైంది. బాహుబలి కోసం ఆమె ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందని జక్కన్న ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

Also Read :  రెండో పెళ్లికి రెడీ అయిపోయిన నిహారిక…?

Visitors Are Also Reading