Home » “సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లెచెట్టు” సినిమాను మిస్ చేసుకున్న 10 మంది న‌టీన‌టులు వీళ్లే…!

“సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లెచెట్టు” సినిమాను మిస్ చేసుకున్న 10 మంది న‌టీన‌టులు వీళ్లే…!

by AJAY
Ad

టాలీవుడ్ లో వ‌చ్చిన బెస్ట్ మ‌ల్టీ స్టార‌ర్ చిత్రాల‌లో సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లెచెట్టు సినిమా కూడా ఒక‌టి. ఈ సినిమాలో మ‌హేశ్ బాబు, వెంక‌టేష్ హీరోలుగా న‌టించారు. స‌మంత‌, అంజ‌లి హీరోహీరోయిన్ లుగా న‌టించగా ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. 2013 సంక్రాంతి కానుక‌గా వ‌చ్చిన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా వ‌చ్చి ప‌దేళ్లు అవుతున్నా టీవీ లో ప్ర‌సారం అయితే మిస్ కాకుండా చూసే ప్రేక్ష‌కులు ఉన్నారు.

Advertisement

 

అయితే ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాన్ని ఏకంగా ప‌ది మంది న‌టీన‌టులు మిస్ చేసుకున్నారు. ఆ న‌టీన‌టులు ఎవ‌రో ఇప్పుడు చూద్దాం….

ఈ సినిమాలో ప్ర‌కాష్ రాజ్ న‌టించిన రేలంగి మామ‌య్య పాత్ర కోసం ద‌ర్శ‌కుడు మొద‌ట ర‌జీనీకాంత్ ను అనుకున్నాడు. కానీ ర‌నీకాంత్ రిజెక్ట్ చేయ‌డంతో ఆ స్థానంలో ప్ర‌కాష్ రాజ్ ను తీసుకున్నారు. అంతే కాకుండా నాజ‌ర్ కూడా రేలంగి మామ‌య్య పాత్ర‌ను మిస్ చేసుకున్నాడు.

Advertisement

మ‌హేశ్ బాబు స్థానంలో మొద‌ట ప‌వ‌న్ క‌ల్యాణ్ ను అనుకున్నారు. కానీ ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా ఈ సినిమాను రిజెక్ట్ చేశాడు. అంతే కాకుండా వెంక‌టేష్ న‌టించిన పాత్ర కోసం మొద‌ట నాగార్జున ను అనుకున్నారు.

కానీ నాగార్జున ఆ పాత్ర‌లో న‌టించ‌డానికి నో చెప్పాడు. ఇక వెంక‌టేష్ భార్య పాత్ర కోసం అంజ‌లి స్థానంలో భూమిక‌, విద్యా బాల‌న్ ల‌ను సంప్ర‌దించగా వారు కూడా రిజెక్ట్ చేశారు.

Also Read:  మెగా హీరోతో ఛాన్స్ కొట్టేసిన జాన్వి కపూర్.. సినిమా ఏంటంటే..?

అంతే కాకుండా ఈ పాత్ర‌లో న‌టించే ఛాన్స్ ను అనుష్క కూడా రిజెక్ట్ చేసింది. ఇక మ‌హేశ్ బాబు వెంక‌టేష్ ల‌కు త‌ల్లి పాత్రలో జ‌య‌సుధ స్థానంలో న‌టి సుధ‌ను సంప్రాదించారు. కానీ సుధ ఆ పాత్ర‌ను రిజెక్ట్ చేశారు. ఇక ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా కూడా మ‌ణిశ‌ర్మ‌ను అనుకున్నారు కానీ ఆయ‌న నో చెప్ప‌డంతో మిక్కీ జే మేయ‌ర్ ను తీసుకున్నారు. ఇక స‌మంత చెల్లెల్లలో ఒకరి కోసం బాలీవుడ్ న‌టి హీనా ఖాన్ ను సంప్ర‌దించారు. కానీ ఆమె రిజెక్ట్ చేశారు.

Also Read: మెగా హీరోతో ఛాన్స్ కొట్టేసిన జాన్వి కపూర్.. సినిమా ఏంటంటే..?

Visitors Are Also Reading