Home » మెగా హీరోతో ఛాన్స్ కొట్టేసిన జాన్వి కపూర్.. సినిమా ఏంటంటే..?

మెగా హీరోతో ఛాన్స్ కొట్టేసిన జాన్వి కపూర్.. సినిమా ఏంటంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

దివంగత అందాల ముద్దుగుమ్మ శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ అంటే తెలియని వారు ఉండరు. ఆమె సినిమాల కంటే ఎక్కువగా సోషల్ మీడియా ద్వారానే తన ఫాలోయింగ్ పెంచుకుంది.. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే జాన్వి కపూర్ గ్లామర్ తో కుర్రకారపు చెమటలు పట్టిస్తుంది.. ఇప్పటికే ఆమె బాలీవుడ్ లో గుడ్ లక్ జెర్రీ, గుంజన్ సక్సేనా, మినీ లాంటి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకుంది. అయితే ఈ అందాల ముద్దుగుమ్మ త్వరలో తెలుగు ఇండస్ట్రీలోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నదని తెలుస్తోంది.

Advertisement

also read:స్టార్ట్ డైరెక్టర్ గుణశేఖర్ కూతురి పెళ్లి వేడుక…. వరుడి బ్యాగ్రౌండ్ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే…?

అది కూడా మెగా ఫ్యామిలీ హీరోతో జతకట్టబోతోందని సమాచారం.. మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం.. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ఒక సినిమా వస్తున్న విషయం మనందరికీ తెలిసినదే. ఈ చిత్రానికి వెంకట సతీష్ కిలర్ నిర్మాతగా చేస్తున్నారు. ప్రస్తుతం వీరు వృద్ధి సినిమా బ్యానర్ పై భారీ ప్రాజెక్టు చేస్తున్నారు. శంకర్ తో చేస్తున్న ఈ మూవీ షూటింగ్ పూర్తయిన వెంటనే రామ్ చరణ్ తో సినిమా చేయనున్నారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో పాన్ ఇండియా స్థాయిలో రానున్న ఈ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. దీనికోసం జాన్వీ కపూర్ ను సంప్రదించారట..

Advertisement

ఇప్పటికే ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియా లెవెల్ లో స్టార్ హీరోగా మారిన చరణ్, జాన్వికి అవకాశం ఇవ్వడం అంటే ఆమె అదృష్టం అని చెప్పవచ్చు. అంతేకాకుండా అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో వస్తున్న పుష్ప2 చిత్రంలో కూడా జాన్విని ఒక ప్రత్యేక పాట కోసం తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.. పుష్పా మొదటి భాగంలో సమంత ప్రత్యేకమైన పాటలో చేసి సినిమా రేంజ్ ని మరో లెవల్ లో ఉంచింది. ఇప్పుడు ఇదే అవకాశం జాన్వీకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ విధంగా రెండు ఆఫర్లు మెగా ఫ్యామిలీ నుంచి జాన్వికి వెళ్ళినట్టు తెలుస్తోంది.. ఇది ఓకే అయితే జాన్వి తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో రాబోవు రోజుల్లో తెలుస్తుంది.

also read:

Visitors Are Also Reading