Home » ఆవుకు సీమంతం.. 24 రకాల వంటలతో సహా..!

ఆవుకు సీమంతం.. 24 రకాల వంటలతో సహా..!

by Anji
Ad

సాధారణంగా కొంత మంది హిందువులు ఆవుని ఎంతో మంది భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు. అంతేకాదు.. ఆవుని ఎంతో ఇష్టంగా సొంత ఇంటి పిల్లల్లా భావించి పెంచుకుంటారు. ఆవులు, వాటి సంతానాన్ని తమ ఇంటి సభ్యుల మాదిరిగా ఎంతో అల్లారు ముద్దుగా చూడటమే కాదు.. వాటికి సీమంతం, పుట్టిన రోజు, నామకరణం వంటి ఫంక్షన్లు జరిపి 10 మందికి తమ సంతోషాన్ని పంచుతూ వేడుకలను జరుపుతారు. తాజాగా ఓ కుటుంబం వైభవంగా గోమాతకు సీమంతం ఫంక్షన్ నిర్వహించారు. ఇలాంటి అపురూపమైన దృశ్యం  తమిళనాడు రాష్ట్రంలోని ఓ గ్రామంలోని చోటు చేసుకుంది. 

Advertisement

కల్లకురిచ్చి జిల్లా శంకరాపురం గ్రామంలో గర్భిగా ఉన్న ఆవుకు సాంప్రదాయం సీమంతం వేడుక చేసారు. ఈ వేడుకలో 500 మంది అతిథులు కూడా హాజరయ్యారు. మీడియాలో వచ్చిన పలు కథనాల ప్రకారం.. మేలపట్టు గ్రామంలో ఉన్న ఆరుతరమ్ తిరుపురసుందరి ఆమ్మవారి ఆలయ ట్రస్ట్ ఈ ఆవును సంరక్షిస్తుంది. ఇక ఈ ఆవు పేరు అంశవేణి. సీమంతం వేడుక సందర్భంగా ఆవును అలంకరించారు. మహిళలు చక్కగా దుస్తులు ధరించి ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. ఈ ఫంక్షన్ లో ఆవుకి మొత్తం 24 రకాల వంటకాల వంటకాలతో విందునిచ్చారు.  పండ్లు, స్వీట్లు కూడా ఉన్నాయి. మహిళలు చక్కగా దుస్తులు ధరించి ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. ఇక సీమంతం చేసుకునన ఆవుకు పలు రకాల గిప్ట్ లు అందాయి. మహిళలు ధరించే కంకణాలతో సహా 48 రకాల కానుకలు కూడా ఆవుకు అందాయి. 

Advertisement

Also Read :  నేలపై వాలని ఈ పక్షి గురించి మీకు తెలుసా ?

Manam News

సీమంతం కార్యక్రమానికి ముందు ఆలయ అర్చకులు గోవుకు శుభ్రంగా స్నానం చేయించారు. ఆ తరువాత పూలతో గంటలతో అందంగా అలంకరించారు. ఈ వేడుక పూర్తయిన తరువాత ప్రజలందరూ ఈ ఆవు నుంచి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. ఇక ఆ తరువాత అందరికీ ప్రసాదం పంపిణీ చేశారు. ఆవును దత్తత తీసుకోవడం లేదా ఆవులను గోమాతగా భావించి పెంచుకోవడం.. సీమంతం వేడుక చేయడం ఇది మొదటి ఏమి కాదు.. గతంలో ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో తరచుగా తమ ఆవుకు సీమంతం వేడుక.. పుట్టిన లేగ దూడకు బారసాల వేడుక చేయడం సర్వసాధారణమే.  

Also Read :  Cow Hugging : లవర్స్ కి అలర్ట్… ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు కాదట… “కౌ హాగ్ డే”నట..!

Visitors Are Also Reading