Home » Cow Hugging : లవర్స్ కి అలర్ట్… ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు కాదట… “కౌ హాగ్ డే”నట..!

Cow Hugging : లవర్స్ కి అలర్ట్… ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు కాదట… “కౌ హాగ్ డే”నట..!

by Bunty
Ad

ఫిబ్రవరి 14 వస్తుందంటే ప్రేమికులు అందరూ తమ ప్రియమైన వారికి ఎలాంటి గిఫ్ట్స్ ఇవ్వాలా అని ఆలోచిస్తూ ఉంటారు. వాలంటైన్స్ డే ఎక్కడ? ఎలా మొదలైంది? అనే విషయాన్ని పక్కన పెడితే వాస్తవానికి వాలెంటైన్స్ డే వారం ముందు నుంచే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ప్రతి ఏడాది ఫిబ్రవరి 7 తారీఖు మొదలు 14వ తేదీ వరకు వాలెంటైన్స్ వీక్ గా జరుపుకుంటూ ఉంటారు. కానీ ఇకపై ఫిబ్రవరి 14వ తేదీ స్పెషల్ ఏమిటంటే కౌ హాగ్ డే అని కూడా చెప్పాల్సి ఉంటుంది.

Advertisement

పాశ్చత్య సాంస్కృతితో భారత్ లో వేదకాల సాంస్కృతి, సాంప్రదాయాలు దాదాపు అంతరించిపోయే దశకు చేరుకున్నాయని, కాబట్టి ఫిబ్రవరి 14వ తేదీన గోమాత ఆలింగన దినోత్సవంగా గోవు ఆరాధకులు జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఓ అప్పీల్ చేసింది. కేంద్ర మత్స్య, పశుసంవర్ధక డైరీ మంత్రిత్వ శాఖ పరిధిలోని యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా సోమవారం ఓ అప్పీల్ చేసింది. ఈ ప్రకటనలో ఫిబ్రవరి 14వ తేదీన జరుపుకోవాలనే సూచనలు చేసింది భారత సాంస్కృతి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా గోవు ఉంటుందని మనందరికీ తెలిసిందే.

Advertisement

గోవులు మన జీవిత పురోగతికి, పశు సంపద, జీవవైవిద్యతకు కీలకంగా ఉన్నది. ఆవులను కామదేనువు, గోమాత అని కూడా పిలుచుకుంటారు. ఎందుకంటే ఇది తల్లి స్వభావాన్ని కలిగి ఉంటుంది. మానవాళికి అవసరమైన వాటిని అందిస్తుంది అని ఈ అప్పీల్ పేర్కొంది. పాశ్చత్య సాంస్కృతి అభివృద్ధి చెందుతున్న కొద్ది వేదకాల సాంప్రదాయాలు దాదాపు అంతరించే దశకు చేరుకున్నాయి. ఈ పాశ్చత్య సాంస్కృతి మెరుపులతో మనం ఫిజికల్ కల్చర్, హెరిటేజ్ ను దాదాపు మరిచిపోయాం అని ఈ అప్పీల్ లో పశుసంక్షేమ బోర్డు తెలిపింది.

READ ALSO : రిషబ్ పంత్ చెంప పగలగొడతా : కపిల్ దేవ్

Visitors Are Also Reading