Home » భర్త చేసిన డక్స్ కు భార్య సంబరాలు..!

భర్త చేసిన డక్స్ కు భార్య సంబరాలు..!

by Azhar
Ad

ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో కొన్ని జంటలు అనేవి ఎక్కువగా ఫెమస్ అవుతున్నాయి. అందుకు కారణం ఆ జంటలోని ఇద్దరు క్రికెట్ కు సంబంధించిన వారే కావడం. అయితే ఇప్పుడు అందులో బుమ్రా, సంజనా పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే బుమ్రా భారత జట్టులో ముఖ్యమైన బౌలర్ కాగా… సంజనా ఐసీసీ హోస్ట్. ఇరాక్ ఈ కారణంతో పాటుగా బుమ్రా ప్రదర్శనలపైనా కూడా సంజనా తనదైన శైలిలో స్పందిస్తూ కూడా అందర్నీ నవ్విస్తుంది. అయితే ప్రస్తుతం బుమ్రా భారత జట్టుతో కలిసి ఇంగ్లాండ్ లో ఉన్నాడు.

Advertisement

అక్కడ మొదట జరిగిన టెస్ట్ మ్యాచ్ లో బుమ్రా ఒక్కే ఓవర్ లో 35 పరుగులు సాధించగా.. అసలు బుమ్రాకు బ్యాటింగ్ లో టెక్నీక్స్ చెప్పింది నేనే అని పేర్కొంది. అలాగే నిన్న ఇండియా – ఇంగ్లాండ్ జట్ల మధ్య మొదటి వన్డే మ్యాచ్ జరిగింది. ఇక ఇందులో బుమ్రా బౌలింగ్ కు ఇంగ్లాండ్ ఆటగాళ్లు చుక్కలు చూసారు. 110 పరుగులకే ఆల్ ఔట్ అయ్యారు. ఇక అందులో మొత్తం నలుగురు ఆటగాళ్లు డక్ ఔట్ కాగా.. వారిలో ముగ్గురిని బుమ్రానే పెవిలియన్ చేర్చాడు. అందులో జాసన్ రాయ్(0), జోరూట్(0), లివింగ్ స్టోన్(0) వంటి స్టార్ బ్యాటర్లు ఉన్నారు. ఇక ఇలా ఇంగ్లాండ్ ఆటగాళ్లు డక్స్ కావడంపై ట్రోల్స్ చేసింది సంజనా.

Advertisement

మ్యాచ్ సమయంలో ఓ వీడియోను పోస్ట్ చేసింది సంజనా. అందులో… నేను ఇప్పుడు ఉన్నది ఓ ఫుడ్ ఏరియా. చాలా బిజీ ప్లేస్. ప్రస్తుతం ఇక్కడ మొత్తం ఇంగ్లీష్ అభిమానులతో ఇది నిండిపోయింది. ఎందుకంటే.. అక్కడ గ్రౌండ్ లో ఇంగ్లండ్ ఆటగాళ్ల బ్యాటింగ్ చూడలేక ఇక్కడికి వస్తున్నార. అయితే ఇక్కడ చాలా స్టాల్స్ ఉన్నాయి. అందులో ప్రస్తుతం ఇంగ్లాండ్ బ్యాటర్లు అస్సులు ఇష్టపడని స్టాల్ దగ్గరకు నేను ఉన్నారు. దీనిని పేరు క్రీస్పీ డక్. ఇప్పుడు టీం ఇండియా బౌలర్ల ధాటికి గ్రౌండ్ లో డక్‌ వస్తుండటంతో… నేను ఇక్కడ బయట ఉన్న డక్స్‌ కోసం వచ్చాను’ అని పేర్కొంది. ఇక ప్రస్తుతం ఈ వీడియో అనేది వైరల్ అవుతుంది.

ఇవి కూడా చదవండి :

చిరంజీవి డ్యాన్స్ కు ఫిదా అయిపోయిన కోహ్లీ…!

ఐసీసీ ర్యాంకింగ్స్ లో టీం ఇండియా కొత్త చరిత్ర…!

Visitors Are Also Reading