Home » సానియా డివోర్స్ లో ట్విస్ట్.. మొత్తం చెప్పేసిన సానియా తండ్రి..!

సానియా డివోర్స్ లో ట్విస్ట్.. మొత్తం చెప్పేసిన సానియా తండ్రి..!

by Sravya
Published: Last Updated on
Ad

ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా క్రికెటర్ షోయబ్ మాలిక్ ని చాలా కాలం క్రితం పెళ్లి చేసుకున్నారు. పాకిస్తాన్ నటి సనా జావేద్ ని తాజాగా సానియా భర్త షోయబ్ మాలిక్ పాకిస్తాన్ నటి సనా జావేద్ ని పెళ్లి చేసుకున్నాడు. స్వయంగా ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అతను పంచుకున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అయితే గత కొన్ని రోజులుగా షోయబ్ మాలిక్ సానియా విడాకులు తీసుకుంటున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

Advertisement

Advertisement

కానీ ఈ విషయంపై ఎక్కువ ఓపెన్ అవలేదు ఈ జంట దీంతో వీళ్ళు విడాకులు తీసుకున్నారా లేదా అనేది సస్పెన్స్ గానే ఉండిపోయింది. ఇప్పుడు కూడా వీళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారా లేదా అనేది ఎవరికీ తెలియట్లేదు. తాజాగా సానియా తండ్రి ఇమ్రాన్ మీర్జా కీలక ప్రకటన చేశారు. తన కూతురు సానియా, షోయబ్ మాలిక్ విడాకులు తీసుకున్నారని క్లారిటీ ఇచ్చేసారు. షరియా చట్టంలోని ఖులా పద్ధతిలో సానియా షోయబ్ కి డివోర్స్ ఇచ్చిందని చెప్పారు. ముస్లిం స్త్రీ తన భర్తకి విడాకులు ఇచ్చే స్వేచ్ఛ ఉంది దాని ప్రకారమే సానియా కూడా అతనికి విడాకులు ఇచ్చిందని స్పష్టం చేశారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading