Home » టర్కీలో ఎంజాయ్ చేస్తున్న సమంత విజయ్..!

టర్కీలో ఎంజాయ్ చేస్తున్న సమంత విజయ్..!

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా స్పీడ్ గా స్టార్ హోదా సంపాదించుకున్న హీరో ఎవరైనా ఉన్నారు అంటే ముందుగా గుర్తుకు వచ్చేది విజయ్ దేవరకొండ మాత్రమే. ఇండస్ట్రీలో రౌడీ హీరో అనగానే విజయ్ దేవరకొండ అందరికీ గుర్తుకొస్తారు. అలాంటి ఆయన ఈ మధ్యకాలంలో లైగర్ సినిమా డిజాస్టర్ తర్వాత ఎలాగైనా వచ్చే సినిమాలో హిట్ కొట్టాలని చాలా కష్టపడుతున్నారట. ఈ సందర్భంలోనే శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఖుషి చిత్రంపై అనేక ఆశలు పెట్టుకున్నారట. ఇందులో సమంత హీరోయిన్ గా చేస్తోంది.

Advertisement

తెలుగు, మలయాళ, కన్నడ,హిందీ, తమిళ్ భాషల్లో సెప్టెంబర్ 1న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. విజయ్ దేవరకొండ పుట్టినరోజు కానుకగా ఇటీవల విడుదల చేసినటువంటి ఫస్ట్ సింగిల్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇందులో సమంత విజయ్ దేవరకొండ కెమిస్ట్రీ బాగా కుదిరిందని ఫ్యాన్స్ కామెంట్లు పెట్టారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. షూటింగ్లో భాగంగా సమంత విజయ్ దేవరకొండ టర్కీ వెళ్లారు.

Advertisement

అక్కడ అందమైన లొకేషన్ లో ఇద్దరి పైన ఒక పాటను కూడా చిత్రీకరిస్తున్నారు. దానికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అలాగే షూటింగ్ విరామ సమయంలో అక్కడే రెస్టారెంట్లో విజయ్ దేవరకొండ తనకు నచ్చినటువంటి ఫుడ్ తింటూ ఫోటోలను పంచుకున్నారు. సమంత కూడా అక్కడి అందాలను ఎంజాయ్ చేస్తూ ఫోటోలను నెట్టింట పోస్ట్ చేయడంతో ఇవి కాస్త వైరల్ గా మారుతున్నాయి. అయితే ఈ సినిమాలో విజయ్ ఆర్మీ ఆఫీసర్ గా సమంత కాశ్మీర్ యువతిగా కనిపించబోతుందట.

మరికొన్ని ముఖ్య వార్తలు :

Visitors Are Also Reading