Home » బాలయ్య రిజెక్ట్ చేసిన కథతో బ్లాక్ బస్టర్ కొట్టిన రామ్ చరణ్… ఆ మూవీ ఏంటో తెలుసా..?

బాలయ్య రిజెక్ట్ చేసిన కథతో బ్లాక్ బస్టర్ కొట్టిన రామ్ చరణ్… ఆ మూవీ ఏంటో తెలుసా..?

by AJAY
Ad

నందమూరి నట సింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలకృష్ణ ఇప్పటివరకు తన కెరియర్లో ఎన్నో సినిమాలను వదులుకున్నాడు. కొన్ని సినిమాలను ఇతర సినిమాలతో బిజీగా ఉండడంవల్ల వదులుకోగా… మరికొన్ని సినిమాలను కథ నచ్చకపోవడం వల్ల వదులుకున్నాడు. అలా ఈ హీరో వదులుకున్న సినిమాలలో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాలను అందుకోగా… మరికొన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్ విజయాలను సాధించినవి కూడా ఉన్నాయి.

Advertisement

అలా బాలకృష్ణ రిజెక్ట్ చేసిన మూవీలలో బ్లాక్ బాస్టర్ గా నిలిచి టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సినిమా కూడా ఒకటి ఉంది. అదే సినిమా అని అనుకుంటున్నారా… అదే మగధీర. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించగా… కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించింది. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను అందించిన ఈ మూవీకి ఎం ఎం కీరవాణి సంగీతం అందించాడు. ఈ మూవీలో చరణ్, కాజల్ ఇద్దరు కూడా రెండు విభిన్నమైన పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించారు.

Advertisement

ఈ మూవీని గీత ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించాడు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ 2009వ సంవత్సరం విడుదల అయ్యి అప్పటివరకు ఏ తెలుగు సినిమా కూడా కలెక్ట్ చేయని రేంజ్ లో కలక్షన్లను వసూలు చేసి టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇంతటి భారీ విజయం అందుకున్న ఈ సినిమా కథను మొదట రాజమౌళి… బాలకృష్ణ కు వినిపించాడట. ఈ మూవీ కథ బాలయ్య బాబుకు అద్భుతంగా నచ్చినప్పటికీ కొన్ని అనివార్య కారణాలవల్ల ఈ సినిమాలో నటించలేను అని చెప్పాడట.

దానితో వెంటనే రాజమౌళి ఈ కథను రామ్ చరణ్ కు వినిపించడం… ఈ నటుడు కూడా ఈ మూవీలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాజమౌళి… బాలకృష్ణకు చెప్పిన కథతో చరణ్ తో మగధీర అనే మూవీని రూపొందించి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఇలా రాజమౌళి… బాలకృష్ణతో తీయాలి అనుకున్న మూవీని చరణ్ తో రూపొందించి అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఈ మూవీ ద్వారా రాజమౌళి, చరణ్, కాజల్ కి అద్భుతమైన గుర్తింపు లభించింది.

Visitors Are Also Reading