Home » జయం మూవీలో హీరోగా నితిన్ కంటే ముందు అనుకుంది అతన్నే… ప్రస్తుతం స్టార్ హీరో..!

జయం మూవీలో హీరోగా నితిన్ కంటే ముందు అనుకుంది అతన్నే… ప్రస్తుతం స్టార్ హీరో..!

by AJAY
Ad

సినిమా ఇండస్ట్రీలకు ఎంట్రీ ఇచ్చే వారిలో కొంతమంది మాత్రమే మొదటి సినిమాతో మంచి విజయాలను అందుకుంటారు. అలా మొదటి మూవీతోనే మంచి విజయం అందుకున్న వారిలో నితిన్ ఒకరు. ఈయన తేజ దర్శకత్వంలో రూపొందినటువంటి జయం మూవీతో వెండితెరకు పరిచయం అయ్యి మొదటి మూవీతోనే అద్భుతమైన బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాలో సదా… నితిన్ సరసన హీరోయిన్గా నటించగా… గోపీచంద్ ఈ మూవీలో విలన్ పాత్రలో నటించాడు.

Advertisement

ఆర్పి పట్నాయక్ ఈ మూవీకి సంగీతం అందించాడు. 2002 వ సంవత్సరం ఈ మూవీ విడుదల అయింది. ఒక కోటి 80 లక్షల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ఆ సమయంలో అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన సదాకు కూడా ఇదే మొదటి సినిమా. ఈ మూవీ ద్వారా నితిన్, సదాకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన గుర్తింపు లభించింది.

Advertisement

ఇది ఇలా ఉంటే మొదట ఈ మూవీ దర్శకుడు తేజ ఈ మూవీని నితిన్ తో అనుకోలేదట. ఈ కథను ఈ మూవీ దర్శకుడు అల్లు అర్జున్ కోసం అనుకున్నాడట. అప్పటికి బన్నీ ఏ సినిమాలో కూడా హీరోగా నటించలేదు. కాకపోతే ఒక సందర్భంలో అప్పటికే అల్లు అర్జున్ ను రాఘవేందర్రావు దర్శకత్వంలో ఇంట్రడ్యూస్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అని తెలియడంతో తేజ ఈ మూవీని నితిన్ తో ప్రొసీడ్ అయ్యాడట.

అలా అల్లు అర్జున్ కోసం తయారు చేసుకున్న కథను తేజ… నితిన్ తో రూపొందించాడట. ఇకపోతే అల్లు అర్జున్… రాఘవేంద్రరావు కాంబినేషన్లో గంగోత్రి అనే మూవీ రూపొందింది. ఈ మూవీ ద్వారానే బన్నీ హీరోగా ఇంటడ్యూస్ అయ్యాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం అందుకుంది.

Visitors Are Also Reading