Home » చిరంజీవికు బాలయ్య పంచ్…ఇది మామూలుగా లేదుగా!

చిరంజీవికు బాలయ్య పంచ్…ఇది మామూలుగా లేదుగా!

by Bunty
Published: Last Updated on
Ad

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ వీరసింహారెడ్డి. శృతిహాసన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మించింది. సంక్రాంతి కానుకగా జనవరి నెల 12న విడుదలైన వీరసింహారెడ్డి తొలి రోజునే రికార్డు బ్రేక్ కలెక్షన్స్ సాధించి, ఆ తర్వాత వరుస రికార్డులతో దూసుకుపోయింది. తాజాగా ఈ చిత్రం వంద రోజులు పూర్తి చేసుకుంది.

read also : 5 నిమిషాల సుఖం కోసమే హీరోయిన్లతో… ఆంటీ ప్రగతి సంచలనం!

Advertisement

ఈ నేపథ్యంలో ఈ చిత్రం వంద రోజుల ఫంక్షన్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు ఓ పోస్టర్ ని విడుదల చేశారు. 8 కేంద్రాలలో విజయవంతంగా 100 రోజులని పూర్తి చేసుకుంటుంది. ఏప్రిల్ 23న వీరసింహారెడ్డి వీరమాస్ బ్లాక్ బస్టర్ 100 డేస్ సెలబ్రేషన్స్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈవెంట్ కు చిత్ర టీం అంతా హాజరు కాబోతుంది. అయితే ఈ క్రమంలో వేసిన పోస్టర్లు ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది.

Advertisement

READ ALSO : Rama Banam : అదిరిన ‘రామబాణం’ ట్రైలర్.. గోపీచంద్‌కు మరో హిట్ గ్యారెంటీ..

Balakrishna's Veera Simha Reddy Satire On Chiranjeevi's Waltair Veerayya Collections

సెంచరీ విత్ సింగిల్ హ్యాండ్ అంటూ పోస్టర్ వేశారు. హైదరాబాద్ లో ఈ పోస్టర్స్ అంతటా దర్శనమిస్తున్నాయి. ఇవి చిరంజీవి అభిమానులకు కోపం తెప్పిస్తున్నాయి. అందుకు కారణం చిరంజీవి వాల్తేరు వీరయ్య లో రవితేజ కూడా మరో హీరోగా కనిపించడం, ఆ విషయాన్ని ఈ పోస్టర్ సెటైర్ వేయడం. బాలయ్య సింగిల్ హ్యాండ్ తోనే సెంచరీ కొట్టారని ఆ పోస్టర్ లో అంతరార్థం. ఇప్పుడీ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బాలయ్య అభిమానులు ఆనందంతో షేర్ చేస్తుంటే, చిరు అభిమానులు అవసరమా ఇప్పుడు ఇంత హంగామా అంటున్నారు.

READ ALSO : ఎవరి సోనియా సింగ్ ? ఈ బ్యూటీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

Visitors Are Also Reading