Telugu News » Sai Pallavi : పెళ్లి వార్త‌ల‌పై క్లారిటీ ఇచ్చిన సాయిప‌ల్ల‌వి..!

Sai Pallavi : పెళ్లి వార్త‌ల‌పై క్లారిటీ ఇచ్చిన సాయిప‌ల్ల‌వి..!

by Anji

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో త‌న‌దైన శైలిలో దూసుకెళ్తుంది హీరోయిన్ సాయి ప‌ల్లవి. ఫిదా చిత్రంతో అంద‌రిని ఫిదా చేసి.. ఇక గ‌త ఏడాది ల‌వ్‌స్టోరీ, శ్యామ్ సింగ‌రాయ్ చిత్రాల‌తో హిట్ అందుకుంది ఈ అందాల తార‌. ఇక ఆ త‌రువాత ఒక్క సినిమాకు కూడా సైన్ చేసిందే లేద‌ట దీంతో సినిమాల‌కు దూరంగా ఉన్న సాయిప‌ల్ల‌వి పెళ్లి చేసుకోనున్నట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. అందుకోస‌మే సినిమాల‌ను ఒప్పుకోవ‌డం లేద‌ని కూడా టాక్‌.

Ads

దీంతో సాయిప‌ల్ల‌వి ఫ్యాన్స్ వార్త‌ల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. మంచి క‌థ‌ల‌ను ఎంచుకునే ఆమె అలాంటి క‌థ‌ల‌ను ఎంచుకోవ‌డానికి కొద్దిగా స‌మ‌యం ప‌డుతుంది. మాట‌లోనే ఆమెకు పెళ్లి చేసేస్తారా..? ఒక సినిమా అవ్వ‌గానే మ‌రొక సినిమా సైన్ చేయాల‌ని రూల్ ఏమైనా ఉందా అని ప్ర‌శ్నించారు. గ‌త కొద్ది రోజుల నుంచి వ‌స్తున్న ఈ వార్త‌ల‌కు సాయిప‌ల్ల‌వి స‌మాధానం చెప్పింది.

నిన్న ఆమె న‌టించిన విరాట ప‌ర్వం విడుద‌ల తేదీని ప్ర‌క‌టించ‌గా.. తాజాగా త‌న కొత్త సినిమా అప్‌డేట్‌ను రివీల్ చేసి ఎట్టకేల‌కు పెళ్లి వార్త‌ల‌కు చెక్ పెట్టింది. ఆమె మిమ్మ‌ల్ని ఆశ్చ‌ర్యప‌రిచింది. కొంత‌కాలం దాక్కుంది. ఆమె సోమ‌వారం మిమ్మ‌ల్ని చూడ‌డానికి సిద్ధంగా ఉన్న‌ట్టు పేర్కొంది. మే 09న క‌లుద్దామంటూ.. ఒక ఫొటోను షేర్ చేసింది. ఇక ఫొటోలో సాయిప‌ల్ల‌వి కాళ్లు మాత్ర‌మే క‌నిపిస్తున్నాయి. సింపుల్ చీర‌, నార్మ‌ల్ చెప్పులు, ఒక బ్యాగ్‌తో గాల్లో ఎగురుతూ క‌నిపించింది. ఈ పోస్టర్‌తో ఇది కూడా ఆమెకు పేరు తెచ్చే సినిమాల‌నే అనిపిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాలి అంటే ఇంకొక రెండు రోజులు ఆగాల్సిందే..

Also Read : 

ఉష్ణోగ్ర‌త‌లు పెరిగితే మీ శ‌రీరంలో జ‌రిగే మార్పుల గురించి మీకు తెలుసా..?

అందరూ అలా చూసేవాళ్ళే అంటూ నోరూరిస్తున్న శ్రీరెడ్డి…వీడియో వైరల్…!


You may also like