Home » బాలకృష్ణ సూపర్ హిట్ మూవీలో ఛాన్స్ మిస్ చేసుకున్న సాయిపల్లవి.. ఏదో తెలుసా?

బాలకృష్ణ సూపర్ హిట్ మూవీలో ఛాన్స్ మిస్ చేసుకున్న సాయిపల్లవి.. ఏదో తెలుసా?

by Anji
Ad

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో కొన్ని సార్లు అనుకోకుండా హీరోలు, హీరోయిన్లు ఫిక్స్ అవుతుంటారు. మరికొన్ని సార్లు ఎప్పటినుంచో ఆ హీరోనో, హీరోయిన్ నే తీసుకుందామనుకున్న సమయంలో కొన్ని అనివార్య కారణాల వారి స్థానంలో మరొకరు వచ్చి చేరుతుంటారు. ఇలా చాలా సందర్భాల్లో జరిగింది కూడా. ముఖ్యంగా క్రేజీ కాంబినేషన్ సెట్ చేసేందుకు దాదాపు దశాబ్దాల సమయం కూడా పట్టే అవకాశముంది. తాజాగా సినీ ఇండస్ట్రీలో ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. నందమూరి నటసింహం బాలయ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయనతో సినిమా చేసేందుకు ఇటు నిర్మాతలు, అటు నటీనటులు అందరూ చాలా ఆసక్తి చూపిస్తుంటారు. 

Advertisement

బాలయ్య సినిమాలో ఎప్పుడు అవకాశం లభిస్తుందా అని ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న హీరోయిన్స్ కూడా ఉన్నారు. మంచి క్రేజీ ఉన్న హీరో బాలయ్య సినిమాలో అవకాశం వస్తే చేతులారా మిస్ చేసుకుంది హీరోయిన్ సాయిపల్లవి. లేడీ పవర్ స్టార్ అంటూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె అతి తక్కువ సమయంలోనే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. బాలకృష్ణతో ఆఫర్ వస్తే చాలా సున్నితంగా తిరస్కరించిందట. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కించిన వీరసింహారెడ్డి మూవీ సంక్రాంతి కానుకగా ఈ ఏడాది జనవరి 12న విడుదలై సూపర్ డూపర్ హిట్ టాక్ సంపాదించుకుంది. 

Advertisement

veerasimhareddy-review

 అయితే ఈ సినిమాలో బాలయ్య చెల్లెలుగా వరలక్ష్మీ శరత్ కుమార్ అద్భుతంగా నటించింది. వాస్తవానికి డైరెక్టర్ గోపిచంద్ మలినేని ఈ పాత్ర కోసం తొలుత సాయిపల్లవిని సంప్రదించారట. పాత్ర బాగున్నప్పటికీ.. కథ నచ్చినా సాయి పల్లవి మాత్రం చేయను అని చెప్పేసిందట. రీజన్ కూడా చెప్పకుండా రిజెక్ట్ చేయడంతో గోపిచంద్ కాస్త బాధపడ్డాడట. ఈ తరుణంలోనే మరో ఛాన్స్ గా వరలక్ష్మి శరత్ కుమార్ ని సెలెక్ట్ చేశారట. ఆమె ఓకే చెప్పడంతో ఈ పాత్ర హైలెట్ గా మారింది. మొత్తానికి బాలయ్య చెల్లెలు పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ అదరగొట్టిందనే చెప్పాలి. మరోవైపు కొంత మంది అభిమానులు ఈ పాత్రకు అసలు సాయిపల్లవి సూట్ కాదని పేర్కొంటున్నారు. ఏది ఏమైనప్పటికీ బాలయ్య సినిమాలో సాయిపల్లవి ఛాన్స్ మిస్ చేసుకుంది. 

 మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

వైస్రాయ్ ఘటన తరువాత రోజు పురంధేశ్వరితో ఎన్టీఆర్ ఏమన్నారో తెలుసా ?

ప్రాజెక్ట్ కె నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజ్..! అచ్చు ఆ హాలీవుడ్ సినిమా పోస్టర్ లా ఉందని కామెంట్స్..!

వైస్రాయ్ ఘటన తరువాత రోజు పురంధేశ్వరితో ఎన్టీఆర్ ఏమన్నారో తెలుసా ?

Visitors Are Also Reading