Home » తన ఫెవరెట్ హీరో ఎవరో చెప్పిన సాయి పల్లవి…!

తన ఫెవరెట్ హీరో ఎవరో చెప్పిన సాయి పల్లవి…!

by Azhar
Ad

తెలుగులో ఇప్పుడు చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు. కానీ వారందరిలో సాయి పల్లవి మాత్రం స్పెషల్. ఎందుకు అనేది అందరికి తెలుసు. ఫిదా సినిమాతో తెలుగులోకి వచ్చిన సాయి పల్లవి తన నటన, డ్యాన్స్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత తన వ్యక్తిత్వం అలాగే సినిమాలను ఎందుకుని విధానంతో లేడి పవర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే సాయి పల్లవి ఒక్క సినిమా చేయడానికి తనదైన కొన్ని నియమాలు అనేవి ఉంటాయి. అందుకు ఒప్పుకుంటేనే ఏ సినిమా అయిన చేస్తుంది. లేదంటే.. ఎంత పెద్ద సినిమా అయిన సరే మొహమాటం లేకుండా నో చెబుతుంది.

Advertisement

అయితే టాలీవుడ్ లోకి వచ్చిన మొదట్లో సాయి పల్లవికి ఈ విషయంలో కొంత సమస్య అయిన ఇప్పుడు తనకు ఏర్పడిన ఫ్యాన్ ఫాలోయింగ్ ఆధారంగా ఎన్ని నియమాలు ఉన్న అందరూ ఆమె కావాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే సాయి పల్లవితో సినిమా చేయాలనీ చాలా మంది హీరోలు భావిస్తున్నారు. కానీ తాజాగా సాయి పల్లవి తాను ఎవరితో సినిమా చేయాలి అని అనుకునేది.. అలాగే తన ఫెవరెట్ హీరో ఎవరు అనేది ప్రకటించింది. అయితే ఇప్పుడు సాయి పల్లవి ముఖ్య పాత్రలో నటించిన గార్గి అనే సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే.

Advertisement

ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సాయి పల్లవి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన ఫెవరెట్ హీరో గురించి చెప్పింది. నాకు చాలా ఇష్టమైన హీరో దళపతి విజయ్ అని సాయి పల్లవి పేర్కొంది. ఆయనను ఎప్పుడో 2017 లో ఓ కార్యక్రమంలో కలిసాను. అప్పటి నుండి ఆయనతో సినిమా చేసే అవకాశం ఎప్పుడు వస్తుంది అని ఎదురుచూస్తున్నాను అని సాయి పల్లవి స్పష్టం చేసింది. అయితే పల్లవి నటించిన ఈ గార్గి అనే సినిమా ఈ నెల జులై 15న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇక ఈ మధ్యే పల్లవి విరాటపర్వం ప్లాప్ కావడంతో ఈ సినిమా హిట్ కావాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి :

అండర్ కవర్ ప్రేక్షకులు.. కొత్త ఆలోచనతో వచ్చిన ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు..!

బీసీసీఐపై ఇర్ఫాన్ ఫైర్.. ఎందుకు రెస్ట్..!

Visitors Are Also Reading