Home » అండర్ కవర్ ప్రేక్షకులు.. కొత్త ఆలోచనతో వచ్చిన ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు..!

అండర్ కవర్ ప్రేక్షకులు.. కొత్త ఆలోచనతో వచ్చిన ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు..!

by Azhar
Ad

మనం అండర్ కవర్ అనే పదాన్ని ఎక్కువగా పోలీసులు లేదా దేశ రక్షణ కోసం పనిచేసే వారి విషయంలో వింటూ ఉంటాం. కానీ ఇప్పుడు ఇది క్రికెట్ లోకి కూడా వచ్చింది. అయితే మారుతున్న కాలంతో పాటుగా క్రికెట్ లో కూడా ఎన్నో మార్పులు వస్తున్నాయి. కాలానికి తగ్గిన విధంగా ఈ ఆట అనేది మారుతుంది.. కాబట్టే దీనికి ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది పెరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ క్రికెట్ లోకి ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కొత్త ఆలోచనతో వచ్చింది. అండర్ కవర్ ప్రేక్షకులు అనే పదాన్ని ప్రపంచానికి తెలియజేస్తుంది.

Advertisement

అయితే క్రికెట్ మ్యాచ్ ను లైవ్ లో చూడటానికి వేలలో.. కొన్నిసార్లు లక్షల్లో అభిమానులు వస్తుంటారు. ఇక ఆ మ్యాచ్ అనేది ఎక్కడ జరిగితే అక్కడి జట్టుకు ఎక్కువ మంది తన సపోర్ట్ అనేది ఇస్తుంటే.. ఇంకొందరు మరో జట్టుకి ఇస్తారు. ఇలాంటి సమయంలో అక్కడ ఉన్న వారు ఆ సపోటర్స్ ను అవమానించడం వంటిని చేస్తారు. మన భారత అభిమానులను రంగు ఆధారంగా జాత్యంకారంగా అవమానిస్తారు. ఇది అప్పుడప్పుడు బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేసే ఆటగాళ్లకు కూడా జరుగుతుంది. ఇక ఈ మధ్యే ఇంగ్లాండ్ – ఇండియా మధ్య టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఇలానే జరిగింది. అక్కడి కొంతమంది భారత అభిమానులను అవమానించారు.

Advertisement

ఇక ఈ విషయాన్ని ఇండియన్ ఫ్యాన్స్ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుకి తెలపడంతో వారిని కనుక్కునే పనిలో పడింది బోర్డు. అలాగే ఇలాంటి సంఘటనలు ఇక మీదట జరగకుండా.. అండర్ కవర్ ప్రేక్షకులను రంగంలోకి దించింది. నిన్న ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన మొదటి టీ20 మ్యాచ్ లోనే దీనిని ప్రారంభించారు. అయితే ఈ అండర్ కవర్ ప్రేక్షకులు ఏం చేస్తారు అంటే.. మాములు ఫ్యాన్స్ లా వాళ్లలో కలిసిపోయి అకాడకదా కూర్చొని అందరిని గమనిస్తారు. అక్కడ ఎవరైనా ఆటగాళ్లను గాని.. తోటి ప్రేక్షకులను గాని అవమానిస్తుంటే వారిని అక్కడే పట్టుకొని పోలీసులకు అప్పగిస్తారు. అయితే ఈ అండర్ కవర్ ప్రేక్షకుల గురించి ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఇప్పటికే ప్రకటించింది కూడా.

ఇవి కూడా చదవండి :

సీఎస్‌కేపై మరోసారి కోపాన్ని చూపించిన జడేజా…!

బీసీసీఐపై ఇర్ఫాన్ ఫైర్.. ఎందుకు రెస్ట్..!

Visitors Are Also Reading