Home » టీవీలో ఆర్ఆర్‌ఆర్‌.. ఏ రోజు అంటే…?

టీవీలో ఆర్ఆర్‌ఆర్‌.. ఏ రోజు అంటే…?

by Azhar
Ad

దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి సినిమాతో ఒక్కేసారి పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయాడు. ఆ తర్వాత ఆయన నుండి వచ్చే సినిమా కోసం అందరూ ఎదురు చూసారు. అయితే ఆర్ఆర్ఆర్ పేరుతో 2019 లోనే రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోగా సినిమా చేయబోతున్నట్లు ప్రకటించిన జక్కన… 2020 లోనే విడుదల చేస్తాం అన్నారు. కానీ రాజమౌళి సినిమా అంటే అంత తొందరగా రాదు అందరికి తెలుసు.

Advertisement

ఇక కరోనా కూడా మధ్యలో ఆటంకం కాగా.. ఎట్టకేలకు ఈ ఏడాది ఆ సినిమా అనేది ఫ్యాన్స్ ముందుకు వచ్చింది. ఇక రాజమౌళి అంచనాలకు తగ్గట్లుగానే ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. పాన్ ఇండియా సినిమాగానే వచ్చిన ఆర్ఆర్ఆర్ 1100 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్స్ అనేది చేసింది. ఇక ఈ మధ్యే ఈ సినిమా ఓటీటీ లోకి కూడా వచ్చింది. ఇక ఇప్పుడు టీవీలోకి కూడా రాబోతుంది.

Advertisement

ఆర్ఆర్ఆర్ సాటిలైట్ రైట్స్ హిందీలో జీ తీసుకోగా మిగిలిన భాషలో స్టార్ యాజమాన్యం తీసుకుంది. అయితే జీ కొన్ని రోజుల కిందటే ఈ సినిమాను ఆగస్టు 14న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించగా.. తాజాగా స్టార్ సంస్థ కూడా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది. అయితే దేశం మొత్తం ఈ సినిమాను ఒక్కేసారి టీవీలోకి తేవాలని స్టార్ సంస్థ కూడా ఈ సినిమాను ఆగస్టు 14 నాడే విడుదల చేయనున్నట్లు ప్రకటించాడు. మన తెలుగులో ఈ సినిమాను అదే రోజు స్టార్ మా లో చూడవచ్చు.

ఇవి కూడా చదవండి :

క్రికెట్ నేర్చుకోవడానికి ఇంగ్లాండ్ కు కోహ్లీ భార్య..!

చెన్నై నుండి పోతున్నట్లు మళ్ళీ హింట్ ఇచ్చిన జడేజా..!

Visitors Are Also Reading