Home » చెన్నై నుండి పోతున్నట్లు మళ్ళీ హింట్ ఇచ్చిన జడేజా..!

చెన్నై నుండి పోతున్నట్లు మళ్ళీ హింట్ ఇచ్చిన జడేజా..!

by Azhar
Ad

ఐపీఎల్ లో కొంతమంది అఆటగాళ్లు కొన్ని జట్లకు ఆడుతుంటేనే చూడాలి అని అనిపిస్తుంది. అలాంటి ఆటగాళ్లు చెన్నై సూపర్ కింగ్స్ లో ఎక్కువగా ఉంటారు. ఇందులో ఉండే ధోని, సురేష్ రైనా, జడేలా ఇలాంటి కీలక ఆటగాళ్లు వేరే జట్టుకు ఆడితే ఫ్యాన్స్ చూడలేరు. కానీ ఇందులో ఒక్కడైనా రైనాను ఈ ఏడాది వేలానికి చెన్నై వదిలేయగా వేరే జట్టు తీసుకోలేదు. అందువల్ల అతను కామెంట్రీ చేస్తున్నాడు.

Advertisement

కానీ ఇప్పుడు ఈ లిస్ట్ లో ఉన్న జడేజా కూడా చెన్నై జట్టును వీడుతున్నట్లు చాలా వార్తలు వస్తున్నాయి. ఈ ఐపీఎల్ 2022 లో జడేజాను మొదట కెప్టెన్ చేసి.. ఓటములు రావడంతో తప్పించారు. ఇది అతనికి నచ్చకపోవడంతో యాజమాన్యంతో విబేధాలు వచ్చినట్లు తెలిసింది. అది నిజం అనేలా ఈ మధ్యే ఇంగ్లాండ్ టూర్ లో ఉండగా చెన్నై జట్టు యొక్క అన్ని పోస్టులను ఇంస్టాగ్రామ్ నుండి జడేజా తీసేసాడు. అందువల్ల అతను పోతున్నాడు అని అందరూ అనుకున్నారు.

Advertisement

ఇప్పుడు మళ్ళీ చెన్నై నుండి పోతున్నట్లు హింట్ ఇచ్చాడు జడేజా. అయితే జడేజా 2012 లో చెన్నై జట్టులో చేరగా.. ఈ ఏడాదికి 10 ఏళ్ళు పూర్తయింది. ఆ విషయాన్ని ఈ ఏడాది ఫిబ్రవరిలో చెన్నై జట్టు చెబుతూ ఓ ట్విట్ చేసింది. దానికి జడేజా ఇంకా 10 ఏళ్ళు ఆడుతాను అంటూ ఓ కామెంట్ చేసాడు. కానీ ఇప్పుడు తాజాగా జడేజా దానికి డిలీట్ చేసాడు. అందువల్ల మళ్ళీ జడేజా చెన్నై నుండి పోతున్నాడు అని కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.

ఇవి కూడా చదవండి :

డాక్టర్ అయిపోయిన రైనా..!

క్రికెట్ నేర్చుకోవడానికి ఇంగ్లాండ్ కు కోహ్లీ భార్య..!

Visitors Are Also Reading