Home » ది వారియ‌ర్ : బుల్లెట్ సాంగ్ పై రాక్‌స్టార్ ఏమ‌న్నారో తెలుసా..?

ది వారియ‌ర్ : బుల్లెట్ సాంగ్ పై రాక్‌స్టార్ ఏమ‌న్నారో తెలుసా..?

by Anji
Ad

త‌మిళ ద‌ర్శ‌కుడు లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వంలో రామ్ ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిన‌దే. ది వారియ‌ర్ పేరుతో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో మొట్ట‌మొద‌టిసారిగా ప‌వ‌ర్ పుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టిస్తున్నారు.

Advertisement

 

ఈ సినిమాలో హీరోయిన్‌గా కృతిశెట్టి న‌టిస్తుండగా తాజాగా ఈ సినిమా కోసం త‌మిళ‌స్టార్ హీరో శింబు పాట పాడిన విష‌యం హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ పాట‌కు సంబంధించి టీజ‌ర్ ఒక‌టి విడుద‌ల చేయ‌నున్న‌ట్టు సంగీత ద‌ర్శ‌కుడు దేవిశ్రీ‌ప్ర‌సాద్ ఓ ట్వీట్ చేసారు.

శింబు మీరు ఈ పాట‌ను తెలుగు, త‌మిళం, రెండింటిలోనూ ఇర‌గ‌దీసారు. థాంక్స్ అంటూ దేవిశ్రీ ప్ర‌సాద్ చెప్పారు. ఈ పాట‌కు సంబంధించిన టీజ‌ర్ 20వ తేదీన విడుద‌ల చేస్తున్నామ‌ని దేవిశ్రీ‌ప్ర‌సాద్ ప్ర‌క‌టించారు. శింబు గతంలో పాడిన తెలుగు పాట‌లు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయిన విష‌యం ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే ఈ పాట‌కు బుల్లెట్ అని టైటిల్ కూడా పెట్ట‌డం విశేషం. త‌మిళ స్టార్ పాడిన ఈ పాట ఎలా ఉంటుందో వేచి చూడాలి మ‌రీ.

ఇవి కూడా చదవండి :

  1. బాహుబ‌లి సినిమాలో త‌మ‌న్నా రోల్‌ను మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవ‌రో తెలుసా..
  2. KAJAL AGARWAL : కాజ‌ల్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన చంద‌మామ‌..!
  3. పెళ్లికి సిద్ధ‌మైన ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోయిన్‌..!
Visitors Are Also Reading