Home » KAJAL AGARWAL : కాజ‌ల్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన చంద‌మామ‌..!

KAJAL AGARWAL : కాజ‌ల్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన చంద‌మామ‌..!

by AJAY
Ad

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన‌ట్టు తెలుస్తోంది. ఈరోజు కాజల్ అగర్వాల్ ప్ర‌స‌వించిన‌ట్టు ఓ బాలీవుడ్ వెబ్ సైట్ కథనాన్ని ప్రచురించింది. అయితే ఇప్పటి వరకు ఈ విషయాన్ని కాజ‌ల్ అధికారికంగా వెల్లడించలేదు. ఇది ఇలా ఉండగా కాజల్ అగర్వాల్ జనవరిలో తన ప్రెగ్నెన్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Advertisement

కాజల్ అగర్వాల్ సినిమాలు చేస్తున్న సమయంలోనే ప్రముఖ వ్యాపారవేత్త త‌న‌ చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లును ప్రేమ వివాహం చేసుకుంది. కొంత కాలం డేటింగ్ లో ఉన్న వీరిద్దరూ పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. ఇక పెళ్లి నాటి నుండి కాజల్ అగర్వాల్ తన భర్తతో కలిసి హనీమూన్ ఎంజాయ్ చేస్తూ దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వచ్చింది.

Advertisement

kajal agarwal

kajal agarwal

జనవరిలో మొదటగా తన ప్రెగ్నెన్సీని ప్రకటించింది. ప్రెగ్నెన్సీ తర్వాత అనేకసార్లు బేబీ ఫోటోలను సైతం కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే కొంతమంది నెగిటివ్ కామెంట్లు చేయడం పై కాజల్ అగర్వాల్ సీరియస్ అయింది. తనపై వస్తున్న ట్రోల్స్ ను తీవ్రంగా ఖండించింది. ఇక ఇప్పుడు బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలిసిన కాజల్ అగర్వాల్ అభిమానులు ఫుల్ కుషీగా ఉన్నారు.

సినిమాల విష‌యానికి వ‌స్తే కాజ‌ల్ అగర్వాల్ ప్ర‌స్తుతం సీనియ‌ర్ హీరోల‌తో కూడా సినిమాలు చేస్తోంది.ఇప్ప‌టికే చిరుతో ఖైదీ నంబ‌ర్ 150 లో క‌లిసి న‌టించింది. మెగాస్టార్ తాజా చిత్రం ఆచార్య‌లో కూడా కాజ‌ల్ హీరోయిన్ గా న‌టించింది. ఈ సినిమా విడుద‌ల‌కు సిద్దంగా ఉంది. ప్రెగ్నెన్సీ వ‌ల్లే కాజ‌ల్ సినిమా ప్ర‌మోష‌న్స్ కు కూడా దూరంగా ఉంది.

also read :

ప‌వ‌ర్ స్టార్ స‌తీమ‌ణి అన్నా లెజెనోవా అన్ని కోట్లకు అధిప‌తా..?

Visitors Are Also Reading