Telugu News » Blog » పెళ్లికి సిద్ధ‌మైన ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోయిన్‌..!

పెళ్లికి సిద్ధ‌మైన ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోయిన్‌..!

by Anji
Ads

టాలీవుడ్ అగ్ర హీరోల‌లో ఒక‌రైన ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన కొమురం పులి సినిమా మ‌నంద‌రికీ తెలిసిన‌దే. భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈ చిత్రం ఊహించని విధంగా డిజాస్ట‌ర్‌గా మిగిలిపోయింది. ఇక‌పోతే ఈ సినిమాలో హీరోయిన్ గా న‌టించిన నికిషా ప‌టేల్ గురించి మ‌నంద‌రికీ తెలిసిందే. ఈ సినిమాతో టాలీవుడ్ లోకి నికీషా ప‌టేల్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా డిజాస్ట‌ర్ గా నిలిచిన‌ప్ప‌టికీ నికిషా ప‌టేల్ మాత్రం మంచి గుర్తింపు తెచ్చుకుంది. నికిషాను అంద‌రూ ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోయిన్ అని అంటుండ‌డంతో ఆమె బాధ ప‌డిన‌ట్టు తెలుస్తోంది. త‌న‌కున్న ట్యాగ్ లైన్ ప‌ట్ల ఎంతో బాధ‌ను వ్య‌క్తం చేసింది.

ఇదిలా ఉండ‌గా.. తాజాగా నికిషా ప‌టేల్ త‌న అభిమానుల‌తో చాట్ చేసింది. ఇందులో భాగంగానే అభిమానులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చింది. ఈ త‌రుణంలో హీరో ప్ర‌భాస్ గురించి చెప్పు, అదేవిధంగా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ గురించి ఒక్క‌మాట‌లో చెప్పండి అని నికిషా ప‌టేల్ పై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ గ‌డ్డం లుక్‌లో అద్భుతంగా ఉన్నాడంటూ చెప్పుకొచ్చింది. అనంత‌రం హీరో ప్ర‌భాస్ గురించి మాట్లాడుతూ.. ప్ర‌భాస్ త‌న‌కు మంచి ఫ్రెండ్ అని, ఎంతో హంబుల్‌గా ఉంటాడు, నాకంటే చాలా పొడుగుగా ఉంటాడ‌ని తెలిపింది.

ఇంత‌లోనే మ‌రొక నెటిజ‌న్ నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావ‌ని అడ‌గ‌గా.. అప్పుడు నికిషా చెప్పిన ఆన్స‌ర్‌తో ఆమె పెళ్లి విష‌యం గురించి బ‌య‌ట‌కు వ‌చ్చింది. త్వ‌ర‌లోనే చేసుకుంటాను. పెళ్లి కొడుకు కూడా దొరికేసాడు. యూకేలో ఉంటున్నాడు అని తెలిపింది. నికిషా పటేల్ మాట‌ల‌ను బ‌ట్టి చూస్తే త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లు ఎక్క‌బోతుంద‌ని తెలుస్తోంది. అంతేకాదు.. ఈమె ఒకానొక స‌మ‌యంలో ప్ర‌భుదేవాను పెళ్లి చేసుకోవాల‌నుకుంది అని చేసిన కామెంట్స్ ఎంత‌టి వివాదానికి దారి తీశాయో అంద‌రికీ తెలిసిందే.

ఇవి కూడా చదవండి :

  1. Gruhalakshmi : అమ్మ‌, నాన్న ఇద్ద‌రిలో ఎవ‌రు కావాలో చెప్పేసిన దివ్య‌..!
  2. ఎన్టీఆర్ కొండ‌వీటి సింహంలో చిరును త‌ప్పించి మోహ‌న్ బాబుకు ఛాన్స్…తెర‌వెన‌క క‌థ ఇదే..!
  3. ప‌వ‌ర్ స్టార్ స‌తీమ‌ణి అన్నా లెజెనోవా అన్ని కోట్లకు అధిప‌తా..?

You may also like