Home » పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై ఆర్జీవీ సినిమా ?

పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై ఆర్జీవీ సినిమా ?

by Anji
Ad

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన ఏం చేసినా అది ఒక సంచలనం గా మారు తుందనే విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ఆర్జీవీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. సీఎం క్యాంపు కార్యాలయంలో దాదాపు  రెండు, మూడు  గంటల పాటు ముఖ్యమంత్రితో ముచ్చటించారు వర్మ.


ప్రస్తుతం వీరిద్దరి భేటీ పెద్ద చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరూ సమావేశంలో ఏం మాట్లాడుకున్నారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ముఖ్యంగా రాంగోపాల్ వర్మతో పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యల గురించి సినిమా తీయాలని రాంగోపాల్ వర్మ కు సీఎం జగన్ సూచించినట్టు సమాచారం. వర్మ  మరోసారి పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాజకీయాలతో పాటు దేశ రాజకీయాలపై కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా సెటైర్లు, కామెంట్లు పోస్ట్ పెడుతుంటారు వర్మ. ఇప్పటికే ఎన్టీఆర్ బయోపిక్ తీసిన వర్మ మరోసారి పవన్ కల్యాణ్ పై సినిమా చేయనున్నారు.

Advertisement

Advertisement

Also Read :  విజయ్ దేవరకొండ పై బాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు.. అందుకోసమేనా ?

సీఎం జగన్ తో వర్మ సుధీర్ఘ  భేటీలో   వీరు రాజకీయాలతో పాటు సినిమాలపై కూడా చర్చించినట్టు తెలుస్తోంది. సీఎం జగన్ కి పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వినిపించినట్టు తెలుస్తోంది. పవన్ మూడు పెళ్లిళ్లపై ఈ మధ్యకాలంలో కొందరు నాయకులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఈ వ్యవహారాలన్నీ కలిపి వర్మ ఓ కథ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే వర్మ పవన్ కళ్యాణ్ పై రెండు సినిమాలు తీశాడు. అయితే ఆ సమయంలో పవర్ స్టార్ ఫ్యాన్స్ కూడా వర్మ ని రేంజ్ లో ఆడుకున్నారు. పవన్ మూడు పెళ్లిళ్లపై సినిమా అంటే పవర్ స్టార్ అభిమానులు ఏం చేస్తారనేది వేచి చూడాలి మరి.

Also Read :   కాంతార సినిమాలో చూపించిన పింజ‌ర్లి దేవ‌త ఎవ‌రు..? ఆ ఆచారం వెన‌క ఉన్న క‌థ ఏంటంటే..?

Visitors Are Also Reading