Home » విజయ్ దేవరకొండ పై బాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు.. అందుకోసమేనా ?

విజయ్ దేవరకొండ పై బాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు.. అందుకోసమేనా ?

by Anji
Ad

టాలీవుడ్ యాంగ్ హీరో విజయ్ దేవరకొండ పై బాలీవుడ్ నటి మలోబిక బెనర్జీ సంచలనం వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచాయి. గతంలో విజయ్ హిందీ భాషను అవమానించేలా మాట్లాడాడంటూ బెంగాలీ నటి సింగర్ అయినా మలోబిక బెనర్జీ తెలిపింది. రీసెంట్ గా ఓ ఛానల్ తో ముచ్చటించిన ఆమె ఈ సందర్భంగా లైగర్ మూవీ గురించి ప్రస్తావించింది. ఒకప్పుడు హిందీ భాష పై అనుచిత వ్యాఖ్యలు చేసి అవమానించిన విజయ్ ఇప్పుడు అదే భాషలో సినిమా తీశాడు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది .ఈ మేరకు ఆమె మాట్లాడుతూ విజయ్ తో నేను కలిసి ‘నీ వెనకాలే నడిచి’ మ్యూజిక్ వీడియోలో నటించాం.

Advertisement

అప్పటికే విజయ్ నటించిన అర్జున్ రెడ్డి మూవీ హిట్ కావడంతో అతడు పాపులర్ అయ్యాడు. ఆ మ్యూజిక్ వీడియో షూటింగ్ సమయంలోనే విజయ్ తో నాకు పరిచయం ఏర్పడింది. నాకు మంచి స్నేహితుడు అయ్యాడు. మేం సరదాగా మాట్లాడుకునే వాళ్ళం. అప్పటికి విజయ్ కి హిందీ పూర్తిగా రాదు. అందుకే తను ఎప్పుడు తెలుగులోనే మాట్లాడేవాడు. కానీ నేను మాత్రం ఎక్కువగా హిందీలోనే మాట్లాడేదాన్ని. ఇక నేను హిందీలో మాట్లాడుతుంటే విజయ్ నవ్వుకునేవాడు. తనకు హిందీ పెద్దగా అర్థం కాదని అది హెబ్రూ భాషల అనిపిస్తుంది అంటూ అవహేళన చేశాడు. అలాంటి విజయ్ హిందీలో సినిమా తీశాడని తెలిసి షాక్ అయ్యా. ఎందుకంటే ఒకప్పుడు హిందీని అవమానించేలా మాట్లాడిన వ్యక్తి అదే భాషలో సినిమా తీశాడు.

Advertisement

Also Read :   సూపర్ స్టార్ కృష్ణ కి స్థలం అమ్మి అప్పులు తీర్చిన చిరంజీవి

కొన్నేళ్ళకు లైగర్ టీజర్ లో విజయ్ ని చూసి నవ్వుకున్న అని చెప్పుకొచ్చింది. అయితే ఈ విషయాన్ని లైగర్ ప్రమోషన్స్ సమయంలోనే చెబుదాం అనుకున్నానని అయితే విజయ్ తనకు మంచి స్నేహితుడు కావడంతో ఆ పని చేయలేకపోయాను అంది. అంతే కాదు విజయ్ టీజర్ ను సోషల్ మీడియాలో షేర్ చేసి వెల్ కమ్ టూ బాలీవుడ్ అనే మెసేజ్ కూడా పెట్టానంది. ఆ తర్వాత తెలిసింది ఏంటంటే హిందీలో విజయ్ కి ఎక్కువ డైలాగ్స్ లేవని తెలిసిందని పేర్కొంది. అయితే ఏది ఏమైనా అప్పటికి విజయ్ చాలా మంచి మనిషి అని చాలా ప్రొఫెషనల్ గా ఉంటాడు అంటూ చివరిలో ఆమె వ్యాఖ్యానించింది. కాగా ఎన్నో అంచనాల మధ్య ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన లైగర్ చిత్రం బాక్సాఫీస్ ఘోర పరాజయం పొందిన సంగతి తెలిసిందే.

Also Read :  కన్నడ సినిమాలకు డిమాండ్ పెరగడానికి కారణం ఏంటో తెలుసా ?

Visitors Are Also Reading