Home » పేపర్ లీక్ కోసం గాలం వేసి .. చివరికీ తానే చిక్కుకుంది..!

పేపర్ లీక్ కోసం గాలం వేసి .. చివరికీ తానే చిక్కుకుంది..!

by Anji
Ad

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్వశ్చన్ పేపర్ లీక్ వ్యవహారం.. ఆరా తీసే కొద్ది పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన గురుకుల ఉపాధ్యాయుని రేణుక రాథోడ్ అలియాస్ రేణుక తెర వెనుక పెద్ద తతంగమే నడిపినట్టు.. అభ్యర్థులతో ముందుగానే బేరం కుదుర్చుకున్నట్టు రూ.లక్షలు కాజేసేందుకు వ్యూహం వేసిందని దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా తమ్ముని పేరుతో ప్రశ్నపత్రాలు సంపాదించేందుకు రేణుక పథకం ప్రకారం.. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగి ప్రవీణ్ నుంచి ప్రశ్న పత్రాలను సేకరించినట్టు పోలీసులు గుర్తించారు. 

Also Read :  హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉద్యోగాలు..నెలకు రూ.35 వేల జీతం

Advertisement

సోదరుడు రాజేశ్వర్ కి ఏఈ ప్రశ్నపత్రాలు కావాలంటూ.. రూ.10లక్షలకు ప్రవీణ్ తో బేరం కుదుర్చుకుంది. అయితే వాస్తవానికి అతను టీటీసీ చదివాడు. కాంట్రాక్టు పనులు చేస్తున్నాడు. అసలు అతనికి ఏఈ పరీక్ష రాసేందుకు అర్హతనే లేదు. ప్రశ్నపత్రాలు తీసుకొస్తానని.. మహబూబ్ నగర్ జిల్లాకి చెందిన నీలేష్ నాయక్, గోపాల్ నాయక్ లతో రేణుక రూ.14లక్షలకు బేరం కుదుర్చుకుంది. వారి వద్ద డబ్బు తీసుకొని ప్రవీణ్ కి ఇచ్చింది. ఆ డబ్బును ప్రవీణ్ తన బ్యాంకు ఖాతాలో జమ చేశాడు. తన బాయికి రూ.3.5లక్షలు ఆన్ లైన్ లో పంపినట్టు గుర్తించారు పోలీసులు. పొరుగు సేవల ఉద్యోగి రాజశేఖర్ కి ప్రవీణ్ డబ్బు ఆశచూపి ప్రశ్న పత్రాలను సంపాదించాడు. రేణుక ఇచ్చిన రూ.10లక్షలలో కొంత ఇస్తానని చెబుతూ వచ్చాడు. ఇంతలోనే అసలు బండారం బయటపడడంతో రాజశేఖర్ కి సొమ్ము అందలేదని పోలీసులు పేర్కొంటున్నారు. 

Also Read :  మీరు అతిగా నిద్ర పోతున్నారా.. అయితే ఈ ప్రమాదంలో పడినట్టే ?

Manam News

మహబూబ్ నగర్ జిల్లా మన్సూర్ తల్లి తండాకి చెందిన కె.శ్రీనివాస్ (30) 2020లో పోలీస్ కానిస్టేబుల్ గా ఎంపికయ్యాడు. ప్రస్తుతం మేడ్చల్ పోలీస్ స్టేషన్ లో విధిలు నిర్వహిస్తున్నాడు. ఎస్సై ప్రిలిమినరీ, దేహదారుఢ్య పరీక్షలో కూడా ఉత్తీర్ణత సాధించాడు. మెయిన్స్ సిద్ధమయ్యేందుకు ఫిబ్రవరి 01 నుంచి సెలవులో ఉన్నాడు. ప్రశ్నపత్రం విక్రయిస్తామంటూ రేణుక ఫోన్ చేసినప్పుడు తనకు అవసరం లేదని చెప్పాడు. కానీ ఏఈ అభ్యర్థులకు సిద్ధమవుతున్న కొంత మంది అభ్యర్థులకు సమాచారం అందించాడు. ఓ పోలీస్ అయి ఉండి కళ్ల ఎదుట ఇంత జరుగుతున్నా నేరం గురించి సమాచారం ఇవ్వడాన్ని ఉన్నతాధికారులు తీవ్రంగా తీసుకున్నారు. అతనిపై సీపీ కార్యాలయానికి నివేదిక పంపినట్టు మేడ్చల్ ఇన్ స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. 

Advertisement

మహబూబ్ నగర్ జిల్లాకి చెందిన రేణుక 2011 సమయంలో ఓపెన్ లో టెన్త్ రాసి ఆ తరువాత ఇతర కోర్సులు చేసిందట. 2018లో హిందీ పండిట్ గా ఉద్యోగం పొంది వనపర్తి జిల్లా బుద్ధారంలోని గురుకుల పాఠశాలలో విధులు నిర్వహిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న సమయంలో రేణుక టీఎస్పీఎస్పీ కార్యాలయానికి వచ్చేది. వన్ టైమ్ పాస్ వర్డ్ కి సంబంధించిన విషయంలో మాట్లాడుతూ.. అక్కడే పని చేస్తున్న ప్రవీణ్ తో పరిచయం పెంచుకుంది. 2017 నుంచి విధుల్లో ఉన్న ప్రవీణ్ TSPSC అధికారుల వద్ద మంచి వ్యక్తిగా మెలిగేవాడు. రేణుక 2023 జనవరి నుంచి పేపర్ లీకేజ్ వ్యవహారం బయటపడే వరకు మొత్తం 16 రోజులు సెలవులు పెట్టింది. జనవరి 23, 28, 31 తేదీల్లో, ఫిబ్రవరి 1, 04 నుంచి 8 వరకు.. అదేవిధంగా 24న సెలవు పెట్టింది. ఇటీవలే జరిగిన ఏఈ పరీక్ష రోజు కూడా రేణుక సెలవు తీసుకుంది. అదేవిధంగా తన కుమారుడి ఆరోగ్యం బాలేదని ప్రిన్సిపల్ కి 4న అర్ధరాత్రి 1 గంటకు వాట్సాప్ మెసేజ్ చేసింది. మార్చి 05న సీఓఈ ప్రవేశపరీక్షకు ఇన్విజిలెటర్ గా హాజరుకావాలని కోరినా రాలేదని సమాాచారం. 

Manam News

తమ మరిది మరణించారని.. మూడు రోజులు సెలవులు కావాలని 10న వాట్సాప్ ద్వారా కోరింది. ప్రిన్సిపల్ 10, 11, 12 తేదీలను సెలవుగా  మార్కు చేశారు. 13న ఎమ్మెల్సీ ఎన్నికల కారణంలో సెలవులో ఉన్నారని సిబ్బంది భావించారు. కానీ అదేరోజు సాయంత్రం ప్రశ్న పత్రం లీకేజీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. టౌన్ ప్లానింగ్  బిల్డింగ్ ఓవర్ సీర్ పోస్టుల రాత పరీక్ష మార్చి 12న జరగాల్సి ఉండగా.. 10, 11, 12, 13 తేదీలలో సెలవులు పెట్టడం గమనార్హం. రేణుకను సస్పెండ్ చేయనున్నట్టు గురుకుల వర్గాలు వెల్లడించాయి. మరోవైపు రేణుక తల్లి లక్ష్మీబాయి మన్సూర్ పల్లి బీఆర్ఎస్ సర్పంచ్ కావడంతో  రాజకీయ పలుకుబడి కూడా ఉంది. గురుకుల ఉపాధ్యాయురాలుగా తనకు, టెక్నికల్ అసిస్టెంట్ గా భర్త ఢాక్యా నాయక్ కి ఉన్నత స్థాయి అధికారులతో పరిచయాలనుపయోగించి లీకేజీకి పూనుకున్నట్టు చర్చ కొనసాగుతుంది.

Also Read  :  రాకరాక అసెంబ్లీకి వచ్చిన బాలయ్య ను బయటకి గెంటేసిన స్పీకర్ !

Visitors Are Also Reading