Telugu News » Blog » రాకరాక అసెంబ్లీకి వచ్చిన బాలయ్య ను బయటకి గెంటేసిన స్పీకర్ !

రాకరాక అసెంబ్లీకి వచ్చిన బాలయ్య ను బయటకి గెంటేసిన స్పీకర్ !

by Bunty
Ads

ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల కింద ప్రారంభమైన ఈ ఏపీ అసెంబ్లీ సమావేశాలు చాలా రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ఈ తరుణంలోనే ఏపీ అసెంబ్లీలో హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య బాబు గురువారం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు.

Advertisement

read also : అక్కినేని-తొక్కనేని మాటలపై స్పందించిన బాలయ్య..అవి ఫ్లోలో వచ్చిన మాటలు !

 

సాధారణంగా రాజకీయాలను సీరియస్ గా…. తీసుకోని బాలయ్య బాబు… ఓ సినీ సెలబ్రిటీగా ఉండడానికే మొగ్గు చూపుతూ వస్తున్నారు. కానీ ఇవాళ సమావేశాల్లో చంద్రబాబు లేకపోవడంతో బాలయ్య బాబు సారధ్యంలో టిడిపి నిరసన వ్యక్తం చేసింది. బాలయ్య బాబు సారధ్యంలో టిడిపి బృందం… ఏపీలో దివాలా బడ్జెట్… జగన్ రెడ్డి కళకళ… ప్రజలు గిలగిల అని రాసి ఉన్న బ్యానర్ ను పట్టుకొని టిడిపి పార్టీ సభ్యులతో కలిసి అసెంబ్లీకి వచ్చారు బాలయ్య.

Advertisement

READ ALSO : రాజయోగం కోసమే NTR రెండు పెళ్లిళ్లు చేసుకున్నారా… దీనికి కారణం అతనే !

అసెంబ్లీలో వైసీపీ మంత్రులతో బాలయ్య సందడి

అప్పుల ఆంధ్ర ప్రదేశ్ అని రాసి ఉన్న ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. టిడిపి ఎమ్మెల్యేలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ సభకు వచ్చారు. వారితో పాటు బాలయ్య బాబు కూడా ఎమ్మెల్యే హోదాలో ఈ నిరసన పాల్గొన్నారు. అలా జగన్ సర్కార్ కు వ్యతిరేకంగా బాలయ్య బాబు నిరసనలు తెలిపారు. ఆ తర్వాత సభ నుంచి బాలయ్య బాబు తో పాటు… ఇతర టిడిపి సభ్యులను స్పీకర్ తమ్మినేని బయటకు పంపించారు. దీంతో రాకరాక వచ్చిన బాలయ్యను… బయటికి పంపించారంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. వైసిపి వర్గం ఆయనకు వ్యతిరేకంగా కామెంట్లు చేస్తూ ఉంటే… తెలుగుదేశం పార్టీ మాత్రం ఆయనను మెచ్చుకుంటుంది.

Advertisement

Read Also : MS Dhoni : లవ్ టుడే హీరోయిన్‌తో ధోని మొదటి సినిమా..