Home » హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉద్యోగాలు..నెలకు రూ.35 వేల జీతం

హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉద్యోగాలు..నెలకు రూ.35 వేల జీతం

by Bunty
Ad

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కార్యాలయం…. ఔట్ సోర్సింగ్ ప్రతిపాదికన జోన్ 6 లో సపోర్ట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

Read Also : MS Dhoni : లవ్ టుడే హీరోయిన్‌తో ధోని మొదటి సినిమా..

Advertisement

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుంచి… సంబంధిత స్పెషలైజేషన్ లో బిఈ లేదా బిటెక్ లేదా MCA మరియు తత్సమాన కోర్సులలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. టెక్నికల్ సపోర్టు రంగంలో కనీసం నాలుగు సంవత్సరాల పని అనుభవం ఉండాలి. ఈ పోస్టుల గురించి పూర్తి వివరాల్లోకి వెళితే… దరఖాస్తుదారుల వయసు డిసెంబర్ 31, 2022వ తేదీ నాటికి 18 సంవత్సరాల నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.

Advertisement

ఈ అర్హతలు ఉన్నవారు ఆన్లైన్ విధానంలో 2023 మార్చ్ 17వ తేదీన సాయంత్రం ఐదు గంటల లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్హతలు, రిజర్వేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారని అధికారులు తెలిపారు. అర్హత సాధించిన వారికి నెలకు 35వేల రూపాయల జీతం చెల్లిస్తారు. ఇతర సమాచారం కొరకు అధికారిక వెబ్సైట్ చూసుకోవచ్చు.

READ ALSO : రాజయోగం కోసమే NTR రెండు పెళ్లిళ్లు చేసుకున్నారా… దీనికి కారణం అతనే !

Visitors Are Also Reading