Home » మీరు అతిగా నిద్ర పోతున్నారా.. అయితే ఈ ప్రమాదంలో పడినట్టే ?

మీరు అతిగా నిద్ర పోతున్నారా.. అయితే ఈ ప్రమాదంలో పడినట్టే ?

by Anji
Ad

సాధారణంగా మనం ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు వ్యాయామము, తగిన నిద్ర చాలా ముఖ్యం. మంచి నిద్ర మనలను ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా మనసును రిప్రెష్ చేస్తోంది. ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం ప్రతి ఒక్కరూ రోజుకు 7 నుంచి 8 గంటలపాటు నిద్రపోవాలి. నిద్ర లేకపోవడం వల్ల వారు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని తరచూ వింటుంటారు. తక్కువ నిద్రపోవడమే కాకుండా అతిగా నిద్రపోవడం కూడా ఆరోగ్యానికి హానికరం అనే విషయం మీకు తెలుసా..? ప్రపంచ నిద్ర దినోత్సవం సందర్భంగా అతిగా నిద్రపోవడం వల్ల కలిగే నష్టాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Also Read :  రాత్రిపూట మీరు చపాతీలు తింటున్నారా ? అయితే మీరు ఈ విషయం తప్పక తెలుసుకోవాల్సిందే..!

Advertisement

అతినిద్ర అన్ని శరీర విధులను నెమ్మదిస్తుంది. వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తోంది. ఒక వ్యక్తిని ఉబకాయానికి గురిచేస్తుంది. అదేవిధంగా భవిష్యత్తులో ఉబకాయము తీవ్రమైన వ్యాధులకు దారితీస్తుంది. ఎక్కువగా నిద్రపోయే వారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదము ఎక్కువగా ఉంటుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రకారం తొమ్మిది గంటలకంటే ఎక్కువ నిద్రపోయే వ్యక్తులు కరోనారీ హార్ట్ డిసీజ్ ప్రమాదాన్ని రెట్టింపు చేయవచ్చట. అదేవిధంగా నిర్ణీత సమయం కంటే ఎక్కువగా నిద్రపోతే మధుమేహానికి కూడా దారితీస్తుంది. 

Advertisement

Also Read :  వంటల్లో ఈ 5 మసాలాలు వాడితే మీ ఒంట్లో కొవ్వును కరిగించినట్టే..!

వాస్తవానికి ఎక్కువ సేపు నిద్రపోవడం వల్ల శారీరక శ్రమ తగ్గుతుంది. చక్కెర స్థాయిలను పెంచుతుంది. తొమ్మిది గంటలకంటే ఎక్కువసేపు నిద్రపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండవని ఓ అధ్యయనం వెల్లడించింది.  గంటల తరబడి కంప్యూటర్ లో ఎక్కువగా పని చేసే వ్యక్తులకు వెన్ను నొప్పి సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అలాంటి వారికి శారీరక శ్రమ సమయము లభించదు. దీని కారణంగా రక్తప్రసరణ సరిగ్గా జరగదు వెన్నునొప్పి సమస్య మొదలవుతుంది. రేపు నిద్ర పోవడం వల్ల శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా పలు సమస్యలు తలెత్తుతాయి. అతి నిద్ర, సోమరితనం పెరుగుతుంది. మెదడును ప్రభావితం చేస్తుంది. ఎక్కువసేపు నిద్రపోవడం వల్ల ఉత్సాహము సానుకూలత తగ్గుతాయి. డిప్రెషన్ కు కూడా దారి తీస్తుంది. కాబట్టి ఎక్కువసేపు నిద్రపోవడం అంతా మంచిది కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. 

Also Read :  సపోటా పండుతో కలిగే బెనిఫిట్స్ తెలిస్తే అస్సలు వదలరు..!

.

Visitors Are Also Reading