Home » Ratha Saptami 2022 : ర‌థ‌స‌ప్త‌మి రోజున ఈ మంత్రాల‌ను త‌ప్ప‌క‌ ప‌ఠించండి

Ratha Saptami 2022 : ర‌థ‌స‌ప్త‌మి రోజున ఈ మంత్రాల‌ను త‌ప్ప‌క‌ ప‌ఠించండి

by Anji
Ad

ఈ ఏడాది ర‌థ స‌ప్త‌మి పండుగ మాఘ శుక్ల స‌ప్త‌మి ఫిబ్ర‌వ‌రి 08 మంగ‌ళ‌వారం రోజు జ‌రుపుకోనున్నారు. సూర్య జ‌యంతి పేరుతో పాటు ఈ రోజును అచ‌ల స‌ప్త‌మి అని కూడా పిలుస్తుంటారు. ర‌థ స‌ప్త‌మి రోజు భ‌క్తులు సూర్య‌భ‌గ‌వానుడికి భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో నియ‌మ‌, నిష్ట‌ల‌తో పూజిస్తారు. త‌ద్వారా భ‌గ‌వంతుడు సంతోషిస్తాడు అని ఆశీర్వాదాలు అందిస్తాడు అని భ‌క్తుల న‌మ్మ‌కం. ఈ రోజు పూజ స‌మ‌యంలో భ‌క్తులు కోరిక‌లు నెర‌వేర‌డం కోసం సూర్య‌మంత్రాల‌ను జ‌పిస్తే, ఫ‌లితం ఉంటుంది. మంత్రాల‌ను ప‌ఠించ‌డం ద్వారా మీకు ఆరోగ్యం, సంతానం, ఆనందం, ధ‌న ధాన్యాలు ల‌భిస్తాయి. ర‌థ‌స‌ప్త‌మి నాడు సూర్య భ‌గ‌వానుడిని ప్ర‌స‌న్నం చేసుకునే ప్ర‌భావ‌వంత‌మైన మంత్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

  • ఆరోగ్యం కోసం మంత్రం ఓం న‌మః సూర్యాయ శాంతాయ స‌ర్వ‌రోగ నివారిణి. ఆయురారోగ్య మైశ్వ‌ర్యం దేహిదేవ జ‌గ‌త్ప‌తే.

 

  •     సూర్య బీజ మంత్రం

 

  • ఓం, హ్రం, హ్రీం, హ్రోం, సః, సూర్యాయ న‌మః

 

  • పుత్రుని పొందుట‌కు సూర్య మంత్ర‌ము.

 

  •  భాస్కరాయ విద్మ హే మ‌హాద్యుతిక‌రాయ ధీమ‌హిత‌న్నో ఆదిత్యఃప్ర‌చోద‌యాత్

 

  • కోరిక‌ల నెర‌వేర్పు సూర్య‌మంత్

 

  • ఓం హీం హీం స‌హ‌స్ర కిర‌ణాయ మ‌నోవాంచిత ఫ‌లం దేహీ దేహీ స్వాహా

 

  • ఓం హ్రీం, ఘృణి, సూర్య ఆదిత్య, క్లీన్ ఓం

 

  • ఓం హ్రీం హ్రీం సూర్యాయ న‌మః

 

  • ఏహి సూర్య స‌హ‌స్రాంశో తేజోరాశే జ‌గ‌త్ప‌తే.. అనుకంప‌య మాం భ‌క్త్యా గృహాణార్ఘ్యం దివాక‌ర !!

 

Also Read :  నా అనుభవం అంత వయసు లేదు… దీప్తి పై కౌశల్ కౌంటర్…!

Advertisement

సూర్యరాధ‌న ప్రాముఖ్య‌త ర‌థ స‌ప్త‌మి రోజున తెల్ల‌వారుజామున లేచి త‌ల‌స్నానం చేసిన త‌రువాత సూర్య‌భగ‌వానుని భ‌క్తితో, విశ్వాసంతో పూజించాలి. సూర్య‌భ‌గ‌వానుని ఆరాధించ‌డం వ‌ల్ల అన్ని ర‌కాల శారీర‌క వ్యాధులు తొల‌గిపోతాయ‌ని, ఆయురారోగ్యాలు క‌లుగుతాయ‌ని న‌మ్మ‌కం. అంతేకాదు తండ్రితో సంబంధాలు స‌రిగ్గా లేని సంతానం ర‌థ‌స‌ప్త‌మిరోజు సూర్య‌భ‌గ‌వానుడి ఆరాధిస్తే మంచి రిలేష‌న్ ఏర్ప‌డుతుంద‌ని పెద్ద‌ల న‌మ్మ‌కం. ఎవ‌రి జాత‌కంలోనైనా సూర్యుడు బ‌ల‌మైన స్థానంలో ఉంటే. ఆ వ్య‌క్తులు స‌మాజంలో కీర్తి, ప్ర‌తిష్ట‌లు పొందుతారు. ఎప్పుడూ విజ‌యాన్ని సొంతం చేసుకుంటారు. తాను ప‌ని చేసే రంగంలో ప్ర‌తీ ఒక్క‌రినీ ప్రేమిస్తాడు.


ర‌థ‌స‌ప్త‌మిని రోజు పూజా విధానం
ర‌థ స‌ప్త‌మిరోజు ఉద‌యం స్నానం చేసి ముందుగా సూర్యోద‌య స‌మ‌యంలో సూర్య భ‌గ‌వానుడికి అర్ఘ్యం స‌మ‌ర్పించండి. ఈ నీటిలో కొన్ని గంగాజ‌లం, ఎర్ర‌టి పువ్వులు మొద‌లైన‌వి వేయండి. దీని త‌రువాత సూర్య‌భ‌గ‌వానుడికి నెయ్యి దీపం, ఎర్ర‌టి పువ్వులు, క‌ర్పూరంతో పూజించాలి. ఉప‌వాస దీక్ష‌ను చేప‌ట్టి త‌మ‌ను బాధల నుంచి విముక్తి చేయ‌మ‌ని సూర్య‌భ‌గ‌వానుడిని ప్రార్థించాలి.

Also Read :  పుష్ప‌ను మిస్ చేసుకున్న 6గురు న‌టీన‌టులు..!

Visitors Are Also Reading