Home » నా అనుభవం అంత వయసు లేదు… దీప్తి పై కౌశల్ కౌంటర్…!

నా అనుభవం అంత వయసు లేదు… దీప్తి పై కౌశల్ కౌంటర్…!

by AJAY
Ad

బిగ్ బాస్ సీజన్ 2 లోకి ఎంట్రీ ఇచ్చిన కౌశల్ ఆ తర్వాత హౌస్ లో జరిగిన కొన్ని గొడవల వల్ల సింపతీ ని సంపాదించుకున్నారు. మిగతా ఇంటి సభ్యులు అంతా ఒకవైపు కౌశల్ ఒకవైపు అవడం వల్ల సింపతి పెరిగి కౌశల్ కు అభిమానులు కూడా భారీగా పెరిగిపోయారు. కౌశల్ ఆర్మీ అంటూ అప్పట్లో సంచలనం రేపారు. అలా ఎంతో క్రేజ్ సంపాదించుకున్న కౌశల్ బిగ్ బాస్ సీజన్ 2 విజేతగా నిలిచారు.

Advertisement

ఇక బిగ్ బాస్ సీజన్ -2 పూర్తయి చాలా కాలం అవుతున్నా పలు ఇంటర్వ్యూలలో కౌశల్ బిగ్ బాస్ గురించి మాట్లాడుతూ ఉంటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కౌశల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బిగ్ బాస్ టైటిల్ గెలిచిన తర్వాత ఎవరు చేయలేని విధంగా తన గెలుపు కోసం కృషి చేసిన వారు అందరినీ కలిసాన‌ని తెలిపారు. ఇండియాలోనే కాకుండా విదేశాల్లో ఉన్న వాళ్లను కూడా తాను వెళ్లి కలిసినట్లు చెప్పారు.

Advertisement

koushla manda

koushla manda

సినిమాల విషయానికి వస్తే కొన్ని కథలు నచ్చక పోవడం వల్ల రిజెక్ట్ చేశారని…. మరికొన్ని ఎక్కువ రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేయడం వల్ల ఆఫర్లు రాకపోవచ్చు అని కామెంట్ చేశారు. అంతేకాకుండా బిగ్ బాస్ లో మిగిలినవారితో పోలిస్తే త‌న‌కు తక్కువే రెమ్యూనరేషన్ ఇచ్చారని చెప్పారు.

deepthi sunaina

deepthi sunaina

తనకు ఇంత‌ గుర్తింపు వస్తుందని బిగ్ బాస్ నిర్వాహకులు సైతం ఊహించి ఉండ‌రని కౌష‌ల్ అన్నారు. అసలు టివి నుండి తీసుకున్న కంటెస్టెంట్ ల‌లో తనే మొదటి వ్యక్తి అని కౌశల్ తెలిపారు. తన తర్వాత నుండి ప్రతి సీజన్లో కూడా బుల్లి తెర నుండి న‌టీన‌టుల‌ను తీసుకుంటున్నారని అన్నారు. వాళ్లందరికీ ఆఫర్స్ వస్తున్నాయి అంటే అది తన వల్లే అని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా బిగ్ బాస్ షోలో నా అనుభవం అంత వ‌య‌సు కూడా లేని దీప్తి సునైనా నేను రెండు వారాల్లో వెళ్ళిపోతాను అని చెప్పడంతో కౌశల్ అంటే ఏంటో నిరూపించాలని అనుకున్నట్టు చెప్పారు. ఎంతో కష్టపడి టైటిల్ గెలిచా అంటూ కౌశల్ తెలిపారు.

Visitors Are Also Reading