Home » పుష్ప‌ను మిస్ చేసుకున్న 6గురు న‌టీన‌టులు..!

పుష్ప‌ను మిస్ చేసుకున్న 6గురు న‌టీన‌టులు..!

by AJAY
Ad

టాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ పుష్ఫ‌. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ గా నిలిచింది. పాన్ ఇండియా లెవ‌ల్ లో విడుద‌లైన ఈ సినిమాకు టాలీవుడ్ తో పాటూ బాలీవుడ్ మ‌రియు ఇత‌ర ఇండ‌స్ట్రీల ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు. ఈ సినిమాలో న‌టించిన న‌టీన‌టుల‌కు దేశ వ్యాప్తంగా క్రేజ్ వ‌చ్చింది. అయితే ఇంత‌టి ఘ‌న విజ‌యం సాధించిన సినిమాను కొంత‌మంది మిస్ చేసుకున్నారు. అలా ఈ సినిమాను మిస్ చేసుకున్న న‌టీన‌టులు ఎవ‌రో ఇప్పుడు చూద్దాం.

mahesh

Advertisement

మ‌హేష్ బాబు
సుకుమార్ ఈ సినిమాలో మొద‌ట‌గా మహేష్ బాబును అనుకున్నాడు. కానీ డీగ్లామ‌ర్ లుక్ కావ‌డం క‌థ త‌నకు సూట్ కాదేమో అన్న అనుమానంతో మ‌హేశ్ బాబు ఈ సినిమాకు నో చెప్పారు. దాంతో అల్లు అర్జున్ ఈ సినిమాలో న‌టించాడు.

also read : మ‌హేష్ త్రివిక్ర‌మ్ సినిమాలో కుర్ర హీరోయిన్..!

samantha

samantha

స‌మంత‌
రంగ‌స్థ‌లంతో మెప్పించిన సమంత‌తోనే సుకుమార్ ఈ సినిమా కూడా తీయాల‌నుకున్నాడు. కానీ స‌మంత బిజీ షెడ్యూల్ వ‌ల్ల నో చెప్ప‌డంతో ర‌ష్మిక‌కు ఆఫ‌ర్ వ‌చ్చింది. కానీ ఐట‌మ్ సాంగ్ కు స్టెప్పులు వేసి సినిమాలో భాగం అయ్యింది.

Advertisement

vijay sethupathi

vijay sethupathi

విజ‌య్ సేతుప‌తి
బిజీ షెడ్యూల్ కార‌ణంగా ఈ సినిమాకు విజ‌య్ సేతుప‌తి నో చెప్పాడు. దాంతో ఆ పాత్ర‌లో ఫ‌హ‌ద్ ఫాజిల్ న‌టించి ఆక‌ట్టుకున్నాడు.

mahesh vitta

mahesh vitta

మ‌హేశ్ విట్ట‌
క‌మెడియ‌న్ మ‌హేశ్ విట్ట కూడా కేశ‌వ అనే పాత్రకోసం పుష్ఫ ఆడిష‌న్స్ కు వెళ్లార‌ట‌. కానీ ఆడిష‌న్స్ త‌ర‌వాత మ‌హేశ్ విట్ట ప్లేస్ లో బండారి జ‌గ‌దీశ్ ను సుకుమార్ ఎంపిక చేశాడు.

dishapatani

dishapatani

దిశ‌ప‌టాని

ఈ సినిమాలో ఊ అంటావా..ఊఊ అంటావా పాట గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సినవ‌స‌రం లేదు. సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న ఈ పాట‌కోసం సుకుమార్ దిశ‌పాటానిని అనుకున్నారు. కానీ చివ‌రికి స‌మంత స్టెప్పులు వేసింది.

nara rohith

nara rohith

నారా రోహిత్

ఈ సినిమాలో నారా రోహిత్ ముఖ్య‌మైన పాత్ర‌లో న‌టిస్తున్నాడు అంటూ అప్ప‌ట్లో వార్త‌లు వినిపించాయి. కానీ తర‌వాత నారా రోహిత్ ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నారు.

Visitors Are Also Reading