Home » రెక్కీ 360 టీజ‌ర్ మీరు చూశారా..? ఎలా ఉందంటే..?

రెక్కీ 360 టీజ‌ర్ మీరు చూశారా..? ఎలా ఉందంటే..?

by Anji
Ad

క‌థ, క‌థ‌నం బాగుంటే చిన్న, పెద్ద సినిమాల‌ని తేడా లేకుండా సూప‌ర్ హిట్ సాధిస్తాయి. అదే కోవ‌లో రాబోతున్న సినిమా రెక్కీ 360. స్నోబాల్ పిక్చ‌ర్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెంబ‌ర్ వ‌న్‌గా తెర‌కెక్కుతున్న సూప‌ర్ క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది. శ్రీ‌మ‌తి సాకా ఆదిల‌క్ష్మీ స‌మ‌ర్ప‌ణ‌లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని కొన్ని క్రైమ్‌క‌థ‌లు ఊహ‌కు అంద‌వు అనే ట్యాగ్ లైన్ తో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రానికి ఎన్‌.ఎస్‌.ఆర్‌.ప్ర‌సాద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. క‌మ‌ల‌కృష్ణ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అభిరామ్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్న ఈ సినిమాలో క‌మెడియ‌న్ భ‌ద్ర‌మ్ సెకండ్ హీరోగా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు.


తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. కేవ‌లం 54 సెక‌న్ల నిడివితో ఉన్న ఈ టీజ‌ర్‌లో ప్ర‌తి స‌న్నివేశం కూడా ఉత్కంఠ రేపుతోంది. క్రైమ్ నేప‌థ్యంలో సాగే ఈ క‌థ‌లో ఊహించ‌ని ట్విస్ట్‌లుంటాయ‌ని టీజ‌ర్ ద్వారా అర్థ‌మ‌వుతోంది. ఇక ఈ చిత్ర రూప‌క‌ల్ప‌న‌లో ప్ర‌మ‌ఖ నిర్మాత జెమిని కిర‌ణ్ అందించిన మోర‌ల్ స‌పోర్ట్‌కు ఎప్ప‌టికీ రుణ‌ప‌డి ఉంటామ‌ని మేక‌ర్స్ తెలిపారు. ఇక రెక్కీ 360 త్వ‌ర‌లోనే విడుద‌ల అవ్వ‌నుంది.

Advertisement

Advertisement

ఈ చిత్రంలో ఇప్ప‌టివ‌ర‌కు ఎప్పుడు చేయ‌ని ఓ వినూత్న పాత్ర‌లో క‌మెడియ‌న్ భ‌ద్ర‌మ్ క‌నిపించ‌నున్నాడు. ఇక‌పోతే ఈ క్రైమ్ థిల్ల‌ర్‌లో అమీక్షా ప‌వార్, జ‌స్విక హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఇటీవ‌లే చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను హైద‌రాబాద్‌లోని ఫిల్మ ఛాంబ‌ర్‌లో విడుద‌ల చేయ‌గా ఆడియన్స్ నుంచి సూప‌ర్ రెస్పాన్స్ వ‌చ్చింది. క్రైమ్ థ్రిల్ల‌ర్ జోన‌ర్ లో తెలుగు తెర‌పై ఇప్ప‌టివ‌ర‌కురాని క‌థాంశాన్నిఎవ్వ‌రూ ఊహించని కొన్ని ట్విస్ట్‌లు జోడించి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించిన‌ట్టు పేర్కొంటున్నారు మూవీ మేక‌ర్స్.

Also Read : 

విజ‌య్ దేవ‌ర‌కొండ లైగ‌ర్ సినిమాలో అలా క‌నిపించ‌డానికి కార‌ణం ఏమిటో తెలుసా..?

అదిరిపోయిన రామ్ చ‌ర‌ణ్ న్యూ లుక్‌.. వీడియో వైర‌ల్‌..!

 

Visitors Are Also Reading