Home » విజ‌య్ దేవ‌ర‌కొండ లైగ‌ర్ సినిమాలో అలా క‌నిపించ‌డానికి కార‌ణం ఏమిటో తెలుసా..?

విజ‌య్ దేవ‌ర‌కొండ లైగ‌ర్ సినిమాలో అలా క‌నిపించ‌డానికి కార‌ణం ఏమిటో తెలుసా..?

by Anji
Ad

డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరిజ‌గ‌న్నాథ్ రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతున్న మూవీ లైగ‌ర్‌. ఈ సినిమాను పాన్ ఇండియా లేవ‌ల్‌లో తెర‌కెక్కిస్తున్నారు ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్‌. బాక్సింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్క‌నున్న ఈచిత్రంలో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ అన‌న్య పాండే న‌టిస్తోంది. ఇప్ప‌టికే ఈ చిత్రానికి సంబంధించి విడుద‌లైన పోస్ట‌ర్స్‌, వీడియోస్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కొన‌సాగుతున్నాయి. లైగ‌ర్ మూవీ ఆగ‌స్టు 25న ప్రేక్ష‌కుల ముంద‌కు రానున్న‌ది.


ఈ నేప‌థ్యంలో ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌ను చిత్ర‌బృందం ప్రారంభించింది. ఇందులో భాగంగా హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ పోస్ట‌ర్ విడుద‌ల చేసింది. ఇందులో విజ‌య్ స‌రికొత్త‌గా క‌నిపించ‌డంతో ప‌లువువు సోష‌ల్ మీడియా వేదిక‌గా ట్రోల్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇందులో విజ‌య్ సిక్స్‌ప్యాక్స్ బాడీతో క‌నిపిస్తున్నాడు. ముఖ్యంగా ఈ పోస్ట‌ర్‌ను చాలా డిఫ‌రెంట్‌గా త‌యారు చేశారు. కొన్ని అంత‌ర్జాతీయ బాక్సింగ్ ఛాంపియ‌న్ షిప్‌, అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియ‌న్ షిప్‌ల‌లో పాల్గొనే ఫైట‌ర్ బ‌రువును కొల‌వ‌డానికి ఒంటిమీద నూలుపోగు లేకుండా ఉంటారు. ముఖ్యంగా లీగ్‌ను ఫాలో అయ్యే వారికి మాత్ర‌మే ఇది బాగా తెలుసు. ఈ నేప‌థ్యంతో వ‌చ్చే సినిమా కావ‌డంతో సింబాలిక్‌గా ఈ పోస్ట‌ర్ ను విడుద‌ల చేశారు.

Advertisement

Advertisement

మ‌రొక వైపు విజ‌య్ ఇలా ట్వీట్ చేశాడు. నేను స‌ర్వ‌స్వం పెట్టి తీసిన సినిమా ఇది. న‌ట‌న‌లో మాన‌సికంగా, శారీర‌కంగా నా మోస్ట్ ఛాలెంజింగ్ రోల్‌. త్వ‌ర‌లోనే మీకు వివ‌రాల‌న్నింటిని చెబుతాన‌ని హీరో విజ‌య్ ట్వీట్ చేశారు. ఇక ప్ర‌స్తుతం ఈ పోస్ట‌ర్‌కు ట్రోల్స్‌తో పాటు ప్రేక్ష‌కుల వ‌ద్ద నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. పలువురు సెల‌బ్రిటీలు ఈ పోస్ట‌ర్‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ మ‌రొక విశేషం. ఇక ఈ పోస్ట‌ర్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో వేగంగా 1.3 మిలియ‌న్స్‌కి పైగా లైకులు వ‌చ్చాయి. ఈ ఘ‌న‌త సాధించిన మొద‌టి పోస్ట‌ర్ ఇదే కావ‌డం విశేషం.

Also Read : 

నందమూరి తారక రామారావు త‌న‌ మనవరాళ్ల పేర్లు అలా ఎందుకు పెట్టారు..? వాళ్ళ పేర్లు ఏంటంటే ?

అప్పుడే మొదలయ్యింది..! చిరంజీవి “గాడ్ ఫాదర్” సినిమాలోని ఈ లుక్ అక్కడ కాపీ చేశారా? అంటూ ట్రోల్స్…!

 

Visitors Are Also Reading