Home » అదిరిపోయిన రామ్ చ‌ర‌ణ్ న్యూలుక్‌.. వీడియో వైర‌ల్‌..!

అదిరిపోయిన రామ్ చ‌ర‌ణ్ న్యూలుక్‌.. వీడియో వైర‌ల్‌..!

by Anji
Ad

ఇటీవ‌లే ఆర్ఆర్ఆర్ సినిమాతో భారీ స‌క్సెస్ ఖాతాలో వేసుకున్న మెగాప‌వ‌ర్ స్టార్ ప్ర‌స్తుతం అగ్ర‌దర్శ‌కుడు శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రొక భారీ సినిమా చేస్తున్న విష‌యం విధిత‌మే. ఈ చిత్రాన్ని నిర్మాత దిల్ రాజు భారీగా నిర్మిస్తున్నారు. చ‌ర‌ణ్ స‌ర‌స‌న అందాల భామ కియారా అద్వాని క‌థానాయిక‌గా న‌టిస్తోంది. శ‌ర‌వేగంగా ఈ చిత్రం షూటింగ్ జ‌రుపుకున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ బ‌య‌టికి వ‌స్తున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి మ‌రొక అప్‌డేట్ బ‌య‌టికొచ్చింది.

Advertisement

పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీగా తెర‌కెక్కే ఈ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు. రెండు విభిన్న పాత్ర‌ల్లో రామ్‌చ‌ర‌ణ్ క‌నిపించ‌డం ఎంతో ఆస‌క్తిక‌రంగా మారింది. ముఖ్యంగా చ‌ర‌ణ్ లుక్ ఇదివ‌ర‌కు ఎన్న‌డూ చూడ‌ని విధంగా ఉంటుంద‌ని విన్నాం. కానీ తాజాగా చ‌ర‌ణ్‌కు సంబంధించిన ఈ షాకింగ్ లుక్ బ‌య‌టికి వ‌చ్చింది. రామ్‌చ‌ర‌ణ్ కి మేక‌ప్ చేస్తున్న వీడియో క్లిప్ ఇది. ఇందులో చెర్రీ హాఫ్ లుక్ లో క‌నిపించారు. ఈ లుక్ క్ష‌ణాల్లో వైర‌ల్‌గా మారింది. ముఖ్యంగా గుబురు గ‌డ్డం, క‌ళ్ల‌జోడుతో స‌రికొత్త లుక్‌లో ఆక‌ట్టుకున్నారు. ఈ వీడియో క్లిప్ చూసి మెగా అభిమానులు ఫిదా అవుతున్నారు.

రామ్‌చ‌ర‌ణ్ లుక్‌పై అంద‌రిలో ఓ ర‌క‌మైన ఆస‌క్తి నెల‌కొన్న‌ది. ఆర్‌సీ15 వ‌ర్కింగ్ టైటిల్‌తో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో తండ్రి.. ఇద్ద‌రు కుమారులుగా చెర్రీ క‌నిపించ‌నున్నార‌ని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి విశ్వంభ‌ర‌, స‌ర్కారోడు, అధికారి లాంటి టైటిల్స్ ప‌రిశీల‌న‌లో పెట్టార‌ని స‌మాచారం. ఎక్క‌డ కాంప్ర‌మైజ్ కాకుండా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్న ఈ సినిమాలో ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్‌గా రామ్‌చ‌ర‌ణ్ క‌నిపించనున్నారు. మొత్తానికి ఇందులో ద్విపాత్ర‌లో డిఫ‌రెంట్ గా మ‌నం చూడ‌బోతున్నామ‌న్న‌మాట‌. ఇక దిల్ రాజు నిర్మాత‌గా శ్రీ‌వేంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై రాబోతున్న 50వ సినిమా కావ‌డంతో ఈ చిత్రంపై ఆయ‌న స్పెష‌ల్ కేర్ తీసుకుంటున్నార‌ట. ఇక ఈ చిత్రం విడుద‌ల కోసం మెగా అభిమానులు ఎంతో ఆతృత‌గా ఎదురుచూస్తున్నారు.

Also Read : 

విజ‌య్ దేవ‌ర‌కొండ లైగ‌ర్ సినిమాలో అలా క‌నిపించ‌డానికి కార‌ణం ఏమిటో తెలుసా..?

ప్లాస్టిక్ ఇస్తే ఆ హోట‌ల్‌లో ఏం తిన్నా ఫ్రీ..!

 

Visitors Are Also Reading