Home » లైగర్ సినిమాను ఆలియా ఎందుకు వదులుకుందో తెలుసా..?

లైగర్ సినిమాను ఆలియా ఎందుకు వదులుకుందో తెలుసా..?

by Azhar
Ad

విజయ్ దేవరకొండకు కేవలం మన తెలుగులోనే కాకుండా మొత్తం ఇండియా వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది ఉంది. అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగులో స్టార్ హీరోయిన్ గా మారిపోయిన విజయ్.. ఆ తర్వాత ఇక్కడ చాలా హిట్స్ ఇచ్చాడు. కానీ ఈ ఒక్క అర్జున్ రెడ్డి సినిమా వల్లే మొత్తం ఇండియా వ్యాప్తంగా విజయ్ కు అభిమానులు పుట్టుకువచ్చారు. ఎంతోమంది విజయ్ గొప్ప నటుడు అనే కితాబు కూడా ఇచ్చారు. అయితే కేవలం మాములు ప్రజలే కాకుండా.. సెలబ్రెటీలలో కూడా విజయ్ కు ఫ్యాన్స్ ఉన్నారు. మరి ముఖ్యంగా చాలా మంది హిందీ హీరోయిన్స్ విజయ్ కు ఫ్యాన్స్.

Advertisement

అందులో జాన్వీ కపూర్, సారా అలీఖాన్, కియారా అద్వానీతో పాటుగా బాలీవుడ్ లో ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న.. ఆలియా భట్ కూడా ఉంది. అయితే ఎవరైనా తనకు ఇష్టమైన హీరో సినిమాలో అవకాశం అనేది వస్తే వదులుకోరు. కానీ ఆలియా మాత్రం వదులుకుంది. అయితే ఇండియా వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విజయ్.. తన సినీ కెరియర్ లో మొదటి పాన్ ఇండియా సినిమా చేస్తుంది. లైగర్ పేరుతో వస్తున్న.. ఈ సినిమాకు టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు.

Advertisement

ఇక ఈ సినిమాలో విజయ్ కు జంటగా నటించేందుకు మొదట అవకాశం అనేది ఆలియాకే వచ్చిందట. కానీ లైగర్ కథ మొత్తం విన్న తర్వాత.. ఇందులో హీరోయిన్ పాత్రకు అంతగా ఇంపార్టెన్స్ లేదు అనే కారణంతో.. ఈ సినిమాలో చేయడానికి ఆలియా నో చెప్పిందట. ఇక ఆలియా చెయ్యను అని చెప్పిన తర్వాత.. చిత్ర బృందం అనన్య పాండేను సంప్రదించగా.. ఆమె ఓకే చెప్పింది. అలా ఆలియా చేయాల్సిన ఈ సినిమాను అనన్య చేస్తుంది. అయితే ఈ సినిమా అనన్య కెరియర్ లో బెస్ట్ హిట్ గా నిలుస్తుంది అని అంటున్నారు. అదే జరిగితే అనన్యకు తెలుగులో అవకాశాలు అనేవి రావడం ఖాయం.

ఇవి కూడా చదవండి :

మళ్ళీ బ్యాట్ పట్టనున్న మిథాలీ… రిటైర్మెంట్ బ్యాక్…?

కోహ్లీ గురించి ఒక్క ముక్కలో చెప్పిన అక్తర్..!

Visitors Are Also Reading