Telugu News » Blog » మళ్ళీ జట్టు మారిన అంబటి రాయుడు..!

మళ్ళీ జట్టు మారిన అంబటి రాయుడు..!

by Manohar Reddy Mano
Ads

అంబటి రాయుడు.. ఈ పేరు వినగానే అందరికి 2019 ప్రపంచ కప్ మాత్రమే గుర్తుకు వస్తుంది. ఎందుకంటే అప్పుడు ప్రపంచ కప్ జట్టుకు రాయుడిని ఎంపిక చేయకపోవడంపై పెద్ద రచ్చ జరిగింది. అలాగే బీసీసీఐ సెలక్షన్ పై అప్పుడు సెటైర్లు వేసిన రాయుడు.. తాను అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టు ప్రకటించాడు. కానీ మళ్ళీ తన నిర్ణయాన్ని వెన్నకి తీసుకున్నాడు. ఇక ఆ తర్వాత నుండి దేశవాళీ టోర్నీలలో హైదరాబాద్ జట్టు తరపున ఆడుతూ వస్తున్నాడు. కానీ ఆ తర్వాత ఆంధ్రా జట్టుకు వెళ్ళిపోయాడు. ఇక ఇప్పుడు మళ్ళీ జట్టు మారుతూ బరోడా జట్టు తరపున ఆడనున్నాడు.

Advertisement

అయితే అంబటి రాయుడు 2012 – 14 వరకు బరోడా జట్టు తరపునే ఆడాడు. కానీ ఆ తర్వాత మళ్ళీ హైదరాబాద్ జట్టులోకి వచ్చాడు. ఇక ఆ సమయంలో ఎక్కువగా ఇండియాకు ఆడిన రాయుడికి 2019 ఘటన తర్వాత ఇండియా తరపున అవకాశం అనేది రాలేదు. దాంతో మళ్ళీ హైదరాబాద్ జట్టు తరపున ఆడటం ప్రారంభించాడు. కేవలం ఒక్క 2019లోనే హైదరాబాద్ జట్టుకు ఆడిన రాయుడు.. ఇక్కడ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో చాలా తప్పులు జరుగుతున్నాయి అని ఆరోపణలు చేసాడు. ఈ విషయాని తెలంగాణ మంత్రి కేటీఆర్ కు కూడా ట్విట్టర్ వేదికగా సూచించాడు.

Advertisement

ఇక ఆ తర్వాత నుండి ఆంధ్రా జట్టుకు ఆడటం ప్రారంభించాడు. మరి ఇప్పుడు అక్కడ ఏం జరిగిందో తెలియదు. కానీ మళ్ళీ బరోడా జట్టుకు ఆడాలి అనుకుంటున్నట్లు.. బరోడా క్రికెట్‌ అసోసియేషన్‌ కు తెలియజేసాడు. ఇక ఈ విషయం పై సానుకూలంగా స్పందించిన బీసీఏ అందుకు అంగీకరించింది. ఇక దేశవాళీ టోర్నీలో రాయుడు తమ జట్టుకు ఆడనునట్లు బీసీఏ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ శిశిర్‌ హట్టంగడి స్వయంగా ప్రకటించారు. అయితే ఇప్పుడు ఇండియా తరపున అవకాశాలు రాకపోయినా దేశవాళీలో రాణిస్తూ.. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరపున ఆడుతున్నాడు.

Advertisement

ఇవి కూడా చదవండి :

వన్డే క్రికెట్ చనిపోతుంది అంటున్న అశ్విన్…!

కోహ్లీకి మద్దతుగా నిలిచిన గంగూలీ..!