Home » ఐపీఎల్ 2022కు జడేజా గుడ్ బై…?

ఐపీఎల్ 2022కు జడేజా గుడ్ బై…?

by Azhar
Ad

ఐపీఎల్ లో నాలుగు సార్లు టైటిల్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ ఏడాది ఐపీఎల్ లో అంతగా రాణించలేకపోతుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ గా బరిలోకి వచ్చిన చెన్నై వరుస పరాజయాలను చవి చూసింది. జట్టులో బ్యాటర్లు, బౌలరు అందరూ కలిసి కట్టుగా విఫలం కావడంతో ఇప్పటికి ఆడిన 11 మ్యాచ్ లలో కేవలం నాలుగు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో కొనసాగుతుంది. ఇటువంటి సమయంలో ఆ జట్టుకు మరో షాక్ తగ్గిలింది.

Advertisement

చెన్నై స్టార్ ఆటగాడు రవీంద్ర జడేజా గాయం కారణంగా మిగిలిన సీజన్ కు అందుబాటులో ఉండటం లేదు అని తెలుస్తుంది. చెన్నై జట్టు బెంగళూర్ తో తలపడిన సమయంలో జడేజాకు గాయం కావడంతో.. ఆ తర్వాత ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో జడేజా బరిలోకి దిగలేదు. కానీ తర్వాత మ్యాచ్ కు జడేజా కోలుకుంటాడు అని అనుకున్న.. అతని గాయం మానడానికి ఎక్కువ సమయం పడుతుంది అని తెలుస్తుంది. అందుకే జడేజా ఇక ఈ సీజన్ కు గుడ్ బై చెప్పనున్నాడు అని వార్తలు వస్తున్నాయి.

Advertisement

అయితే ఐపీఎల్ 2022 మెగావేలానికి ముందు జడేజాను 16 కోట్లు పెట్టి రిటైన్ చేసుకున్న చెన్నై యాజమాన్యం జట్టు కెప్టెన్సీ బాధ్యతలు అతని చేతిలో పెట్టింది. కానీ దానిని జడేజా సరిగ్గా నిర్వర్తించలేకపోయాడు. కెప్టెన్సీ భారంతో బ్యాటింగ్, బౌలింగ్ తో పాటు తాను ఎంతో పేరు సంపాదించుకున్న ఫిల్డింగ్ లో కూడా జడేజా ఫోల్ప్ అయ్యాడు. అతని కెప్టెన్సీలో ఆడిన 8 మ్యాచ్ లలో కేవలం రెండు విజయాలు మాత్రమే సాధించింది. ఇక ఆ తర్వాత తనే స్వయంగా మళ్ళీ కెప్టెన్క్యూ పగ్గాలను ధోనికి అప్పగించాడు. అయితే జడేజాకు కెప్టెన్సీ ఇవ్వడం వల్లనే చెన్నై పరిస్థితి ఇలా అయ్యింది అని చాలా మంది మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి :

ఐపీఎల్ 2022 ఫైనల్స్ లో బీసీసీఐ భారీ ప్లాన్స్…?

గోల్డెన్ డక్ నవ్వు పై కోహ్లీ వ్యాఖ్యలు…!

Visitors Are Also Reading