Home » వాళ్లను చూస్తే నవ్వొస్తుంది.. ఆసక్తికర కామెంట్స్ చేసిన రవితేజ

వాళ్లను చూస్తే నవ్వొస్తుంది.. ఆసక్తికర కామెంట్స్ చేసిన రవితేజ

by Anji
Ad

టాలీవుడ్ కి చెందిన మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనఫ్ చేసి పలు షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ఇటీవలే ధమాాకా చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చి రవితేజ ఇప్పుడు రావణాసుర చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.  

Also Read :   షారూఖ్ ఖాన్ ని అధిగమించిన ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

Advertisement

సుధీర్ వర్మ దర్శకత్వంలో రావణాసుర చిత్రం తెరకెక్కుతోంది. ఈ మూవీలో రవితేజకి జోడిగా ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ చిత్రంపై ఇప్పటికే అందరిలో ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు విడుదలైన పాటలు, టీజర్ ఈ సినిమాపై అంచనాలను పెంచేసింది. తాజాగా రావణాసుర ట్రైలర్ విడుదల చేశారు. ఈ చిత్రంలో లాయర్ గా కనిపించనున్నారు. ఈ ట్రైలర్ లో యాక్షన్ సీన్స్ తో నింపేశారు.  

Advertisement

Also Read :  కుమారుడి టాలీవుడ్ ఎంట్రీ పై ర‌వితేజ ఓపెన్..ఏమ‌న్నాడంటే..?

Ravanasura (2023) - Movie | Reviews, Cast & Release Date - BookMyShow

ఈ చిత్రంపై ట్రైలర్ అంచనాలు అమాంతం పెంచేసింది. చాలా మంది చాలా కష్టాలు పడ్డామని  పలు సందర్భాల్లో  చెప్పుకుంటుంటారు. అంతకు మించిన కామెడీ మరొకటి లేదు. ఎవరి కోసం ఎవరు కష్టపడ్డారు. ఎదగడం కోసం ఎవరి కష్టాలు వారు పడ్డారు. ఇలాంటివి చెబుతుంటే  నాకు నవ్వు వస్తుందని పేర్కొన్నారు రవితేజ. ప్రస్తుతం రవితేజ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 

Also Read :  జియో కొత్త సరికొత్త ఆఫర్.. అన్ లిమిటెడ్ డేటా కోసం రీచార్జ్ ఎంతంటే? 

Visitors Are Also Reading