Home » కుమారుడి టాలీవుడ్ ఎంట్రీ పై ర‌వితేజ ఓపెన్..ఏమ‌న్నాడంటే..?

కుమారుడి టాలీవుడ్ ఎంట్రీ పై ర‌వితేజ ఓపెన్..ఏమ‌న్నాడంటే..?

by AJAY
Ad

సినిమా ఇండ‌స్ట్రీలో వార‌సుల ఎంట్రీ చాలా కామ‌న్. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కాలం నుండే వార‌సులు ఎంట్రీ ఇస్తున్నారు. టాలెంట్ ఉండాలే గానీ స్టార్ హీరోలుగా అల‌రిస్తున్నారు. ఎన్టీఆర్ కుమారుడిగా బాల‌య్య ఎంట్రీ ఇచ్చి స్టార్ అయ్య‌డు.అంతే కాకుండా ఏఎన్ఆర్ కుమారుడిగా ఎంట్రీ ఇచ్చిన నాగార్జున సైతం స్టార్ హీరోగా ఎదిగాడు.

Advertisement

ఇక ఆ త‌ర‌వాత త‌రం నుండి కూడా వార‌సులు ఎంట్రీ ఇచ్చి ప్ర‌స్తుతం స్టార్స్ అయ్యారు. అయితే ఇప్పుడు ఇండ‌స్ట్రీలో మ‌రో స్టార్ హీరో కుమారుడి ఎంట్రీ ఉండ‌బోతుంది అంటూ గుస‌గుస‌లు వినిపిస్తున్నారు. ఆయ‌న మరెవ‌రో కాదు మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ కుమారుడే. చాలా కాలంగా ర‌వితేజ కుమారుడు మ‌హాధ‌న్ ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడంటూ గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

Advertisement

కాగా తాజాగా ర‌వితేజ ఓ ఇంట‌ర్వ్యూలో ఆ విష‌యం పై స్పందించాడు. ఆ విష‌యం త‌న‌కు తెలియ‌ద‌ని అన్నాడు. అంతే కాకుండా ప్ర‌స్తుతం మ‌హాధ‌న్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నాడ‌ని చెప్పాడు. సినిమాల్లోకి రావ‌డం ఆస‌క్తి ఉంద‌ని త‌న‌తో చెప్పాడ‌ని అన్నాడు. కానీ ఎప్పుడు వ‌స్తాడో తెలియ‌ద‌ని తెలిపాడు. లైఫ్ పై ఫుల్ క్లారిటీ తో ఉన్నాడ‌ని అన్నాడు.

raviteja

raviteja

అంతే కాకుండా సినిమాల్లోకి వ‌స్తానంటే తాను ఏమీ చెప్ప‌న‌ని ఇప్ప‌టికే చెప్పాల్సినవి అన్నీ చెప్పేశాన‌ని స్ప‌ష్టం చేశాడు. ఇదిలా ఉంటే మ‌హాధ‌న్ ఇప్పటికే ర‌వితేజ హీరోగా న‌టించిన రాజా ది గ్రేట్ సినిమాలో చిన్న‌నాటి ర‌వితేజ పాత్ర‌లో న‌టించి అల‌రించాడు. ఈ సినిమా మంచి విజయం సాధించ‌డంతో పాటూ మ‌హాధ‌న్ ప్ర‌శంస‌లు అందుకున్నాడు.

Visitors Are Also Reading