భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీలలో నటిస్తున్న అందాల భామల్లో రాశీ ఖన్నా ఒకరు. రుద్ర వెబ్ సిరీస్ లలో నెగెటివ్ రోల్ పోషించి ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఈ మధ్య కాలంలో ఫర్జీ తో ప్రేక్షకుల ముందకొచ్చింది. రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన ఈ షో ప్రేక్షకుల నుంచి అమితమైన ఆదరణను దక్కించుకుంది. దీని ఫలితంగా దేశవ్యాప్తంగా ఒక్కోసారి క్రేజ్ పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఐఎండీబీ ప్రచురించే పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ జాబితాలో అగ్రస్థానం కైవసం చేసుకుంది రాశీఖన్నా.
Advertisement
Also Read : జియో కొత్త సరికొత్త ఆఫర్.. అన్ లిమిటెడ్ డేటా కోసం రీచార్జ్ ఎంతంటే?
Advertisement
బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ ని వెనక్కి నెట్టేసి తొలి స్థానాన్ని ఆమె కైవసం చేసుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడింది. “ఐఎండీబీ లిస్ట్ లో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్న విషయం తెలియగానే ఎంతో సంతోషం వేసింది. మానాన్ను ఫోన్ చేసి ఈ సంతోషాన్ని పంచుకున్నానని చెప్పుకొచ్చింది. ఐఎండీబీ గురించి అసలు ఏం తెలియదు. కానీ షారూఖ్ ఖాన్ కంటే తొలి స్థానంలో ఉన్నానని చెప్పగానే ఆశ్చర్యానికి గురైనట్టు తెలిపింది. ఈ విషయాన్ని నేను అయితే అస్సలు నమ్మలేదు.
Also Read : దసరా సినిమా కథను ఆ సూపర్ హిట్ చిత్రం నుండి లేపేశారా..? ఆ సినిమా ఏదంటే ..!
నా జీవితంలో ఓ మైలు రాయిగా ఈ అంశాన్ని భావిస్తున్నాను. కింగ్ ఖాన్ ని ఏ విషయంలో కూడా ఎవ్వరూ ఓడించలేరు. నేను ఆయనను అధిగమించి తొలి స్థానాన్ని దక్కించుకున్నానంటే.. కేవలం నేను నటించిన పాత్రకు దక్కిన ఆదరణ మాత్రమే. ఫర్జీలో నా పాత్రను ప్రజలు బాగా ఇష్టపడ్డారు” అని రాశీ ఖన్నా చెప్పుకొచ్చింది. ఫర్జీ వెబ్ సిరీస్ లో షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషించారు. భారతదేశంలోనే ఎక్కువ మంది వీక్షించిన సిరీస్ గా ఫర్జీ రికార్డును నెలకొల్పింది. దాదాపు 3.7 కోట్ల మంది షోను వీక్షించారు అని అంచనా వేసింది.
Advertisement
Also Read : చక్రి చనిపోయిన తరవాత ఆయన భార్య ఎక్కడ ఉన్నారో తెలుసా..? ఏం చేస్తున్నారంటే.?