Home » కెప్టెన్ అతనైతే చెన్నై ఇప్పుడు మరో రేంజ్ లో ఉండేది..

కెప్టెన్ అతనైతే చెన్నై ఇప్పుడు మరో రేంజ్ లో ఉండేది..

by Azhar
Ad

గత ఏడాది ఐపీఎల్ టైటిల్ సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఏడాది దారుణ పరాజయాలకు గురవుతుంది. ఐపీఎల్ 2022 కోసం జరిగిన మెగవేలంలో కొంతమంది ముఖ్యమైన ఆటగాళ్లను కోల్పోయిన ఈ జట్టు.. సీజన్ ప్రారంభానికి రెండురోజుల ముందు తమ కెప్టెన్ గా రవీంద్ర జడేజాను ప్రకటిచింది. అయితే జడేజా కెప్టెన్సీలో ఆడిన మొదటి నాలుగు మ్యాచ్ లలో ఈ జట్టు పరాజయం చవిచూసింది. దాంతో ధోని తర్వాత చెన్నై కెప్టెన్సీ మరో ఆటగాడికి ఇవ్వాల్సింది అని రవిశాస్త్రి అన్నారు.

Advertisement

Advertisement

తాజాగా చెన్నై వైఫల్యాలపై రవిశాస్త్రి మాట్లాడుతూ… ధోని ఈ ఏడాది కెప్టెన్ గా ఉండడు.. అని జట్టు యాజమాన్యానికి ముందే తెలిస్తే.. వారు గత సీజన్ లో అదరగొట్టిన ఫాఫ్ డుప్లెసిస్ ను కెప్టెన్ గా ఎంచుకుంటే బాగుండేది అని అన్నారు. అప్పుడు జడేజా ఏ ఒత్తిడి లేకుండా.. బ్యాటింగ్, బౌలింగ్ లో రాణించేవాడు. ఇలా చేస్తే ఈ జట్టు ఇప్పుడు మరో రేంజ్ లో ఉండేది అని తన అభిప్రాయం వ్యక్తం చేసాడు.

కానీ ఐపీఎల్ 2022 ముందు జరిగిన మెగవేలంలో ఫాఫ్ డుప్లిసెస్‌ను 7 కోట్లకు రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జట్టు తీసుకొని తమ కెప్టెన్ గా నియమించుకుంది. దాంతో ఇప్పుడు ఆ జట్టు హ్యాట్రిక్ విజయాలతో దూసుకపోతుంది. ఇప్పటికి ఆడిన నాలుగు మ్యాచ్ లలో మూడింట్లో గెలిచి పాయింట్ల పట్టికలో ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉంది.

Visitors Are Also Reading