Home » రెయిన్ బో సినిమాకి రష్మిక ఫస్ట్ ఛాయిస్ కాదు.. ఎవరంటే ?

రెయిన్ బో సినిమాకి రష్మిక ఫస్ట్ ఛాయిస్ కాదు.. ఎవరంటే ?

by Anji
Ad

కన్నడ బ్యూటీ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆమె ఏ సినిమాలో నటించిన దాదాపు ఆ సినిమాకు ఆటోమెటిక్ గా అదృష్టం వరిస్తుంది. ఈమె ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. వెంటనే నేషనల్ క్రష్ అనే ట్యాగ్ ని సొంతం చేసుకుంది. అప్పటి నుంచి ఈ అమ్మడికి భాష బేధాలు లేకుండా భారీ ఆఫర్లు ఒకదాని తరువాత మరొకటి వచ్చి పడుతున్నాయి. ఈ భామ లేడీ ఓరియెంటేడ్ సినిమా చేసే స్టేజ్ కి చేరుకుంది.  

Also Read :  ఆ డాక్యుమెంట్స్ పై 2సంతకాలే.. కాస్ట్యూమ్ కృష్ణ కొంపముంచాయా..?

Advertisement

రెయిన్ బో అనే టైటిల్ ఖరారు చేసిన ఈ చిత్రాన్ని ఇవాళ హైదరాబాద్ లో లాంచ్ చేశారు. నూతన దర్శకుడు శాంతారూబన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మలయాళ నటుడు దేవ్ మోహన్ కథానాయకుడిగా నటిస్తున్నాడు. తాజాగా రెయిన్ బో సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఈ రొమాంటిక్ ఫ్యాంటసీ డ్రామాకు రష్మికా మందన్న ఫస్ట్ ఛాయిస్ కాదట. ఆమె కంటే ముందు ఈ చిత్రం కోసం స్టార్ హీరోయిన్ సమంతను సంప్రదించారు. 

Advertisement

Also Read :  నాగబాబు వైఫ్ పద్మజా గురించి నమ్మలేని నిజాలు..!!

 

సమంతతో ఈ సినిమా చేయబోతున్నామని గత ఏడాది అక్టోబర్ లో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ చాలా ఆలస్యమవుతూ వచ్చింది. ఇన్నాళ్ల తరువాత హీరోయిన్ గా సమంతను తొలగించి ఆమె స్థానంలో రష్మికాను తీసుకొని ప్రాజెక్ట్ ని ప్రకటించారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 07 నుంచి కొనసాగనుంది. ఈ చిత్రాన్ని ఎస్.ఆర్. ప్రకాశ్ బాబు, ఎస్. ప్రభు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 

 Also Read :  శ్రీ లీలకు ఆ క్వాలిటీస్ ఉన్న భర్త కావాలట..!!

Visitors Are Also Reading